< రోమీయులకు 15 >
1 ౧ కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి.
Nosotros que somos fuertes tenemos que ser un apoyo para los débiles, y no agradarnos a nosotros mismos.
2 ౨ మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి.
Dejen que cada uno de nosotros agrade a su prójimo para su bien, para hacerlo fuerte en la fe.
3 ౩ క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.
Porque Cristo no se agradó a sí mismo, sino, como está dicho, las ofensas de los que te insultaban vinieron sobre mí.
4 ౪ ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.
Ahora bien, las cosas que se escribieron antes de nuestro tiempo fueron para nuestro aprendizaje, de modo que a través de la paciencia y por medio del consuelo de las Sagradas Escrituras, tengamos esperanza.
5 ౫ మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి,
Ahora bien, el Dios de paciencia y consolación les ayude a vivir en armonía, en un mismo sentir, unos con otros en Cristo Jesús:
6 ౬ ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.
para que todos juntos a una sola voz glorifiquen al Dios y Padre de nuestro Señor Jesucristo.
7 ౭ కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి.
Entonces, tómense unos a otros en sus corazones, como Cristo nos tomó, para la gloria de Dios.
8 ౮ నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు.
Ahora digo que Cristo ha sido hecho siervo de la circuncisión para dar cumplimiento a las promesas dadas por Dios a los padres,
9 ౯ దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.
Y para que los gentiles le den gloria a Dios por su misericordia; como se dice, por esta razón te alabaré entre los gentiles, y haré una canción a tu nombre.
10 ౧౦ ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,
Y otra vez dice: Participen, gentiles, en la alegría de su pueblo.
11 ౧౧ “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”
Y otra vez, alaben al Señor, todos ustedes gentiles; y todas las naciones le alaben.
12 ౧౨ యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”
Y otra vez Isaías dice: Estará la raíz de Isaí, y el que viene a ser el gobernador de los gentiles; en él los gentiles pondrán su esperanza.
13 ౧౩ మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.
Ahora bien, el Dios de la esperanza te llene de gozo y paz por medio de la fe, para que toda esperanza sea tuya en el poder del Espíritu Santo.
14 ౧౪ సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.
Y yo mismo estoy seguro de ustedes, hermanos, que están llenos de lo que es bueno, completos en todo conocimiento, capaces de aconsejarse unos a otros.
15 ౧౫ అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను.
Pero tengo, en cierta medida, menos temor al escribirles para volver a poner estas cosas delante de ustedes, por la gracia que me fue dada por Dios,
16 ౧౬ ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను.
ser un servidor de Cristo Jesús a los gentiles, haciendo el trabajo de un sacerdote en las buenas nuevas de Dios, para que la ofrenda de los gentiles sea agradable a Dios, siendo santificados por el Espíritu Santo.
17 ౧౭ కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది.
Así que me enorgullezco de Cristo Jesús en las cosas que son de Dios.
18 ౧౮ అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను.
Y me guardaré de hablar de todo lo que no sea lo que Cristo hizo por mí para poner a los gentiles bajo su obediencia en palabra y obras,
19 ౧౯ కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
por señales y prodigios, en el poder del Espíritu Santo; de modo que desde Jerusalén y alrededor hasta Ilírico he dado el mensaje de salvación de Cristo;
20 ౨౦ నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.
Haciendo mi propósito de no tomar las buenas nuevas donde nunca antes se había oído hablar de Cristo, para que mi obra no se base en la de los demás;
21 ౨౧ దీన్ని గురించి ఇలా రాసి ఉంది, “ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
Pero como está dicho en las Sagradas Escrituras, Ellos verán, a quienes las noticias de él no les fueron dadas, y aquellos a quienes no llegaron sus oídos tendrán conocimiento.
22 ౨౨ ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.
Por lo cual con frecuencia me ha sido impedido de ir a ustedes;
23 ౨౩ ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.
Pero ahora, al no tener ningún lugar para mi trabajo en estas regiones y haber tenido durante muchos años un gran deseo de venir a ustedes,
24 ౨౪ కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను.
Cada vez que voy a España (por ello Tengo la esperanza de verlos en mi camino, y después que haya tenido el gusto de verlos, espero que ustedes me ayuden a continuar el viaje.
25 ౨౫ అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను.
Pero ahora voy a Jerusalén para ayudar a los santos.
26 ౨౬ ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.
Porque a los de Macedonia y Acaya les agradaron enviar una cierta cantidad de dinero para los pobres entre los santos de Jerusalén.
27 ౨౭ అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే.
Sí, ha sido su gran placer; y ellos están en deuda con ellos. Porque si los gentiles han tenido parte en sus bienes espirituales, es correcto para ellos, de la misma manera, darles ayuda en las cosas de la carne.
28 ౨౮ నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.
Cuando haya hecho esto y les haya dado este fruto de amor, iré a España.
29 ౨౯ నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
Y estoy seguro de que cuando llegue, estaré lleno de la bendición del evangelio de Cristo.
30 ౩౦ సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Ahora les ruego, hermanos, por nuestro Señor Jesucristo, y por el amor del Espíritu, que trabajen juntos conmigo en sus oraciones a Dios por mí;
31 ౩౧ ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా,
Para que yo esté a salvo de los que están en Judea, que no se han puesto bajo el gobierno de Dios, y que la ayuda que yo tomo para Jerusalén puede agradar a los santos;
32 ౩౨ దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.
Para que yo pueda venir a ti en gozo por la buena voluntad de Dios, y que sea recreado juntamente con ustedes.
33 ౩౩ సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్.
Ahora el Dios de la paz sea con todos ustedes. Amen.