< రోమీయులకు 15 >

1 కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి.
Kita wa kihe ni ngbengblen'a kika vu suron ni biwa bana he ni ngbengblen na.
2 మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి.
Ki tie kpe wa ani kpa sron vayi mbu si'a, ndi ndu kpau sen ngbengblen.
3 క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.
Kristi me ana tie kpe u son tuma na, na wa ba nha. “Imre biwa ba mre'a a k'ma hi ni tumba.”
4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.
Ikpe wa ba nha ni kogon'a, ba nha nda nno ta tre, nitu vusron ni nno ngbengble u litattafai ki he ni yosron.
5 మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి,
Zizan Irji u losron ni nno ngbengble ndu nno yi sron riri u son ni kpambi, nitu son Yesu Kristi.
6 ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక.
A tie wayi ni sron ri ndi ndu yi gbre Rji ni Tie Bachi mbu Yesu Kristi.
7 కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి.
Nitu kima, kpa kpambi to wa Yesu Kristi ngame a kpa yi'a ndu nde Yesu kpa gbre san.
8 నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు.
Mi tre ndi Kristi a ka tie gran u yoji nitu ndindi u Rji, a tie wayi ni ndu ba tabatar ni alkawarai wa banno ba tie sesekasea.
9 దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.
Ni ndu Bira gbre Rji san nitu losron ma. To wa ba nha, “Mi gbre yi san nimi Bira, ndi yose u gbre san nimi nde mbi.”
10 ౧౦ ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,
Ngarli, Ngyri, biyi bitsri, ni ndji ma.
11 ౧౧ “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”
Gbre Bachi san ngarli, biyi bitsri wawu'u. Ndu ndji wawu'u gbre wu san.
12 ౧౨ యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”
Ishaya a tre ndi, Ba fe iha Jessi, wa ani wlunde nda tie cuu nitu bitsri, bitsri ba fe ngbengble sron ni mi ma.
13 ౧౩ మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.
Irji wa ki yo sron niwu'a, nno yi ngyri ni sii ni kpa y'me, ni ndu ngbengble Brji tsratsra nno yi sron.
14 ౧౪ సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.
Ime nitu mu mi kpayi y'me, mrli vayi. Mi kpa y'me ndi biyi ni tumbi bi tie ndindi, ndi he ni to wawuu. Mikpa y'me ndi bi fe kon ndi nno kpambi tre.
15 ౧౫ అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను.
Mi nha ni yiwu ni ngbengble sron nitu kpe bari, ndi ndu nno yi myrien, nitu nno wa ba ne rji ni Rji'a.
16 ౧౬ ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను.
Innoa ndume ka tie gran Kristi Yesu wa ba tonu ni bi kora, limami u tre Rji mi tie nayi ndi ndu nno bikora, ndu he kpe u kpa, ni kebbabe u Rji.
17 ౧౭ కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది.
Mi wruwo ni san nitu ndu wa mi tie ni Rji'a.
18 ౧౮ అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను.
Mina he kpe wa mi trea na, sai kpe wa Yesu tie ndu ni mea, ndi ndu bikora hu tre nda tie ndu.
19 ౧౯ కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
Nitu mgban, ni al'jibai, ni ngbengble brji tsratsra rji ni Urushalima, kagun hi ni llirikum, ndi ji bishara Kristi ni ngbungblu wawu'u.
20 ౨౦ నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.
Ni konyi imyrien mu a he u tretre Rji, ni whrji wa bana to Yesu ni mi nde mua na, ndi ndu me na me nitu ndu ndjiori na.
21 ౨౧ దీన్ని గురించి ఇలా రాసి ఉంది, “ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
Towa ba nha, Bi wa bana taba hla tre ma ni bawu'a na, ndu ba to. Biwa ba na taba wo du mana ndu ba to (fahimta).
22 ౨౨ ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.
Ba zu me bubu ye niyi ni ton gbugbuu.
23 ౨౩ ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.
Zizan mina he ni mbru bubu ni mi gbuyi ni mi se gbugbuu mi zi yosron u ye niyi.
24 ౨౪ కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను.
Iton wa mi he ni Asbaniya mi yo sron ndi mi zu niyi, mita tie mrli vii niyi bika hu me hi ni kima.
25 ౨౫ అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను.
Zizan mihi ni Urushalima, don tie ndu ni bi hi Rji tsratsra.
26 ౨౬ ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.
Ahi kpe u ngyri ni ndji bi Makidoniya ni Akaya ndu ba nno kpe ni bi kungyre (poor) nimi idji bi hu Rji biwa ba he ni Jerusalem.
27 ౨౭ అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే.
Ba ngyri don a he na hla ni tumba. Don bikora ba kawo kabi niba ni mi kon Rji a kati hla ni bawu ndi du ba zoba ngame.
28 ౨౮ నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.
Nakima, mita nno ba kpe wa miji ni ba wua, nini hi ni spain (Asbaniya) mika zuye niyi.
29 ౨౯ నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
Mito ndi iton wa miye ni yia, miye ni lulu Kristi gbugbuu.
30 ౩౦ సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Zizan mi breyi, mrli vayi, nitu Bachi mbu Yesu Kristi, ni son u Brji tsratsra, ta tie ndu bre Rji ni mu ni mi bre mbi.
31 ౩౧ ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా,
Bre ndi ndu me gbujubu ni wo biwa bana kpay'me ni Rji ni Yahudiya na, ni ndu indu wa mi tie ni Urushalima ndu hi kpe wa idji bi hu Brji tsratsra.
32 ౩౨ దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.
Bre ndi ndu me ye niyi ni ngyri nitu kpa y'me Rji, ndi ta yayi fe sii.
33 ౩౩ సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.
Ndu Rji u nno sii hu niyii. Amin.

< రోమీయులకు 15 >