< రోమీయులకు 14 >
1 ౧ విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు.
Pieņemiet to, kas ir vājš ticībā, viņa prātu nesajaukdami.
2 ౨ ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు.
Jo cits tic, ka visu var ēst, bet kas ir vājš, tas ēd dārza augļus.
3 ౩ తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు.
Kas ēd, tas lai nenicina to, kas neēd; un kas neēd, tas lai netiesā to, kas ēd; jo Dievs viņu ir pieņēmis.
4 ౪ వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.
Kas tu tāds esi, ka tu cita kalpu tiesā? Viņš stāv, vai krīt savam paša Kungam; bet viņš taps pacelts, jo Dievs ir spēcīgs, viņu pacelt.
5 ౫ ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.
Dažs cienī vienu dienu vairāk nekā otru, bet dažs visas dienas cienī vienādi; ikviens par to lai pats savā prātā zinās.
6 ౬ ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.
Kas kādu dienu cienī, tas to cienī Tam Kungam; un kas to dienu necienī, tas to necienī Tam Kungam. Kas ēd, tas ēd Tam Kungam, jo viņš pateicās Dievam; un kas neēd, tas neēd Tam Kungam, un pateicās Dievam.
7 ౭ మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.
Jo neviens mūsu starpā nedzīvo sev pašam, un neviens nemirst sev pašam.
8 ౮ మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.
Jo kad dzīvojam, tad dzīvojam Tam Kungam; kad mirstam, tad mirstam Tam Kungam. Tāpēc vai dzīvojam, vai mirstam, mēs piederam Tam Kungam.
9 ౯ చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది?
Jo tādēļ Kristus arī miris un augšāmcēlies un atkal dzīvs tapis, ka tas būtu Kungs pār mirušiem un dzīviem.
10 ౧౦ అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.
Bet tu, ko tu tiesā savu brāli? Jeb arī tu, ko tu nicini savu brāli? Jo mums visiem būs jāstājas priekš Kristus
11 ౧౧ “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.
Jo ir rakstīts: “Es dzīvoju, saka Tas Kungs, Manā priekšā visi ceļi locīsies, un ikviena mēle teiks Dievu.”
12 ౧౨ కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది.
Tad nu ikviens no mums pats par sevi dos atbildēšanu Dievam.
13 ౧౩ కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.
Tāpēc lai mēs cits citu vairs netiesājam, bet to tiesājiet jo vairāk, ka neviens savam brālim neliek piedauzīties, nedz tam dod apgrēcību.
14 ౧౪ సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది.
Es zinu un atzīstu tiešām iekš Tā Kunga Jēzus, ka neviena lieta no sevis nav nešķīsta; bet tam vien, kas to par nešķīstu tura, tam tā ir nešķīsta.
15 ౧౫ నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు.
Bet ja tavs brālis ēdiena dēļ noskumst, tad tu vairs nestaigā pēc mīlestības. Nesamaitā ar savu ēdienu to, par ko Kristus ir miris.
16 ౧౬ మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.
Tad nu lai jūsu labums netop zaimots,
17 ౧౭ దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం.
Jo Dieva valstība nav ēdiens un dzēriens, bet taisnība un miers un prieks iekš Svētā Gara.
18 ౧౮ ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.
Jo kas šinīs lietās Kristum kalpo, tas ir Dievam patīkams un cilvēkiem pieņēmīgs.
19 ౧౯ కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.
Tādēļ lai pēc tā dzenamies, kas der mieram un uztaisīšanai jūsu starpā.
20 ౨౦ ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు.
Neposti Dieva darbu ēdiena dēļ. Visas lietas gan ir šķīstas, bet tās ir nelabas tam cilvēkam, kas ēd un piedauzās.
21 ౨౧ మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది.
Labāki ir, gaļas neēst un vīna nedzert, nekā to darīt, pie kā tavs brālis piedauzās, jeb apgrēcinājās, jeb (ticībā) top vājš.
22 ౨౨ ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు.
Ja tev ir ticība, tad lai tā ir tev pašam Dieva priekšā. Svētīgs ir tas, kas sevi pašu netiesā iekš tā, ko viņš tura par labu.
23 ౨౩ అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.
Bet kam ēdot prāts šaubās, tas ir pazudināts, jo tas nenāk no ticības; bet viss, kas nav no ticības, tas ir grēks.