< రోమీయులకు 13 >
1 ౧ ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
Ikviens lai ir paklausīgs tām valdīšanām, kam tā vara; jo nekādas valdīšanas nav kā vien no Dieva, un kur valdīšanas ir, tur tās no Dieva ir ieceltas.
2 ౨ కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు.
Tad nu, kas valdīšanai turas pretī, tas turas pretī Dieva likumam. Bet kas pretī turas, tie dabūs savu sodu.
3 ౩ పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు.
Jo valdnieki nav bijājami labiem darbiem, bet ļauniem; ja tu negribi no valdīšanas bīties, tad dari labu, tad tev būs teikšana no viņas.
4 ౪ వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు.
Jo tā ir Dieva kalpone tev par labu; bet ja tu ļaunu dari, tad bīsties, jo tā zobenu nenes velti, jo tā ir Dieva kalpone, atriebēja ļaundarītājam par sodību.
5 ౫ కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.
Tāpēc vajag paklausīt ne vien sodības dēļ bet arī zināmas sirds dēļ.
6 ౬ ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
Tāpēc dodat arī meslus. Jo tie ir Dieva sulaiņi, šo savu amatu kopdami.
7 ౭ ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
Tad nu dodiet ikvienam, kas tam nākas: meslus, kam mesli nākas; muitu, kam muita nākas; bijāšanu, kam bijāšana nākas; godu, kam gods nākas.
8 ౮ ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.
Neesiet nevienam neko parādā, kā vien, ka jūs cits citu mīlat; jo kas otru mīl, tas bauslību ir piepildījis.
9 ౯ ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
Jo tas bauslis: tev nebūs laulību pārkāpt, tev nebūs nokaut, tev nebūs zagt, tev nebūs nepatiesu liecību dot, tev nebūs iekārot, un ja vēl ir cits bauslis, tas šinī vārdā top saņemts, proti tanī: tev būs savu tuvāko mīlēt kā sevi pašu.
10 ౧౦ ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
Mīlestība tuvākam ļauna nedara; tad nu mīlestība ir bauslības piepildīšana.
11 ౧౧ కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.
Un to dariet, zinādami to laiku, ka tagad mums ir tā stunda celties no miega; jo tagad mūsu pestīšana ir tuvāka, nekā kad mēs palikām ticīgi.
12 ౧౨ రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.
Nakts ir pagājusi un diena tuvu nākusi, tad lai noliekam tumsības darbus un lai apvelkam gaismas ieročus.
13 ౧౩ పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.
Lai tā kā dienā godīgi staigājam, ne rīšanā un plītēšanā, ne izvirtībā un nešķīstībā, ne bāršanā un ienaidībā.
14 ౧౪ చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.
Bet apvelciet To Kungu Jēzu Kristu un nekopiet miesu uz kārībām.