< రోమీయులకు 12 >

1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ.
I call on you, therefore, brothers, through the compassions of God, to present your bodies [as] a sacrifice—living, sanctified, acceptable to God—your intelligent service;
2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. (aiōn g165)
and do not be conformed to this age, but be transformed by the renewing of your mind, for your proving what [is] the will of God—the good, and acceptable, and perfect. (aiōn g165)
3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.
For I say, through the grace that was given to me, to everyone who is among you, not to think above what it ought to think; but to think so as to think wisely, as to each God dealt a measure of faith,
4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు.
for as in one body we have many members, and all the members do not have the same office,
5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
so we, the many, are one body in Christ, and members of one another—each one.
6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి.
And having gifts, different according to the grace that was given to us: whether prophecy, according to the proportion of faith;
7 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి.
or ministry, in the ministry; or he who is teaching, in the teaching;
8 ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.
or he who is exhorting, in the exhortation; he who is sharing, in simplicity; he who is leading, in diligence; he who is doing kindness, in cheerfulness.
9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.
The love unhypocritical: abhorring the evil; cleaving to the good;
10 ౧౦ సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి.
in the love of brothers, to one another kindly affectioned: in the honor going before one another;
11 ౧౧ ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి.
in the diligence not slothful; in the spirit fervent; serving the LORD;
12 ౧౨ ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి.
in the hope rejoicing; in the tribulation enduring; in the prayer persevering;
13 ౧౩ పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.
to the necessities of the holy ones communicating; the hospitality pursuing.
14 ౧౪ మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు.
Bless those persecuting you; bless, and do not curse;
15 ౧౫ సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.
to rejoice with the rejoicing, and to weep with the weeping,
16 ౧౬ ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.
of the same mind toward one another, not minding the high things, but with the lowly going along; do not become wise in your own conceit;
17 ౧౭ కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి.
giving back to no one evil for evil; providing right things before all men.
18 ౧౮ మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.
If possible—so far as in you—with all men being in peace;
19 ౧౯ ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.
not avenging yourselves, beloved, but give place to the wrath, for it has been written: “Vengeance [is] Mine,
20 ౨౦ “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు. అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”
I will repay again, says the LORD”; if, then, your enemy hungers, feed him; if he thirsts, give him drink; for doing this, you will heap coals of fire on his head.
21 ౨౧ కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.
Do not be overcome by the evil, but overcome, in the good, the evil.

< రోమీయులకు 12 >