< రోమీయులకు 1 >

1 యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న
Павло, раб Ісуса Христа, покликаний [бути] апостолом і обраний, щоб звіщати Добру Звістку Бога,
2 పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది.
яку Він сповістив раніше через Своїх пророків у Святих Писаннях.
3 మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
Це [Звістка] про Його Сина, Який за тілом був нащадком Давида,
4 దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు.
а за Духом святості був визнаний Сином Божим у силі через воскресіння з мертвих, – про Ісуса Христа, Господа нашого.
5 యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది.
Через Нього ми отримали благодать і апостольство, щоб заради Його імені [привести] до послуху віри всі народи,
6 ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము.
серед яких і ви, покликані Ісуса Христа.
7 వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
Усім, хто в Римі, улюбленим Божим, покликаним святим. Благодать вам і мир від Бога, нашого Отця, і від Господа Ісуса Христа.
8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.
Насамперед я дякую моєму Богові через Ісуса Христа за всіх вас, бо про вашу віру говорять у всьому світі.
9 ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి.
Бог, Якому я служу моїм духом, звіщаючи Добру Звістку Його Сина, є моїм свідком, що я завжди пам’ятаю про вас і
10 ౧౦
постійно прошу у своїх молитвах, щоби з волі Божої мені вдалося нарешті прийти до вас.
11 ౧౧ మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.
Прагну побачити вас, щоб розділити з вами якийсь духовний дар для вашого зміцнення,
12 ౧౨
щоб ми підбадьорили одне одного своєю спільною вірою – вашою й моєю.
13 ౧౩ సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష.
Не хочу, брати, щоб ви не знали, як багато разів я планував прийти до вас, аби мати якийсь плід серед вас, як і серед інших народів, але досі мав перешкоди.
14 ౧౪ గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను.
Я боржник перед еллінами й варварами, перед мудрими й неосвіченими.
15 ౧౫ కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.
Саме тому я прагну звіщати Добру Звістку і вам у Римі.
16 ౧౬ సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.
Я не соромлюся Доброї Звістки Христа, оскільки вона є силою Божою для спасіння кожного, хто вірить, – спочатку юдея, а потім і язичника.
17 ౧౭ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
Адже в ній відкривається праведність Божа з віри у віру, як написано: «А праведник житиме вірою».
18 ౧౮ ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.
Бо гнів Божий відкривається з неба проти усякої безбожності та неправедності людей, які своєю неправедністю придушують істину.
19 ౧౯ ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు.
Бо те, що можна знати про Бога, очевидно для них, адже Бог відкрив їм.
20 ౨౦ ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు. (aïdios g126)
Від створення світу невидимі якості Бога – Його вічна сила й божественна природа – були чітко зрозумілі у творінні, так що [люди] не мають виправдання, (aïdios g126)
21 ౨౧ వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.
оскільки вони, знаючи Бога, не прославили Його як Бога й не дякували Йому, але їхні думки стали марними, а їхні нерозумні серця охопила темрява.
22 ౨౨ తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.
Називаючи себе мудрими, вони стали нерозумними
23 ౨౩ వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.
й проміняли славу нетлінного Бога на образи, подібні до смертної людини, птахів, тварин і плазунів.
24 ౨౪ ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు.
Тому Бог віддав їх у гріховні бажання їхніх нечистих сердець, щоб вони самі між собою осквернили свої тіла.
25 ౨౫ వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు. (aiōn g165)
Вони проміняли Божу істину на неправду та поклонялися й служили творінню, а не Творцеві, Який є навіки благословенний. Амінь. (aiōn g165)
26 ౨౬ ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
Через це Бог віддав їх ганебним бажанням. Їхні жінки проміняли природні стосунки на неприродні.
27 ౨౭ అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
Так само й чоловіки відмовилися від природних стосунків із жінками й розпалилися пристрастю один до одного. Чоловіки з чоловіками роблять безсоромні вчинки й отримують самі в собі належне покарання за свої збочення.
28 ౨౮ వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.
Оскільки вони не вважали за потрібне пізнати Бога, то Бог віддав їх [їхньому] розпусному розуму, щоб вони робили те, чого не годиться робити.
29 ౨౯ వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
Вони сповнені всякої неправди, зла, жадібності та розпусти, сповнені заздрощів, убивств, чвар, обману та злоби. Вони поширюють плітки та
30 ౩౦ వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు,
наклепи, ненавидять Бога, вони нахабні, зарозумілі та хвалькуваті, вигадують, як зробити зло, не шанують батьків.
31 ౩౧ మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు.
У них немає розуміння, вони не виконують обіцянок, не мають любові та милосердя.
32 ౩౨ ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
Хоча вони знають праведний наказ Божий про те, що всі, хто робить такі речі, заслуговують на смерть, вони не тільки продовжують їх робити, але й схвалюють тих, хто [це] робить.

< రోమీయులకు 1 >