< రోమీయులకు 1 >
1 ౧ యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న
১ঈশ্ৱৰো নিজপুত্ৰমধি যং সুসংৱাদং ভৱিষ্যদ্ৱাদিভি ৰ্ধৰ্ম্মগ্ৰন্থে প্ৰতিশ্ৰুতৱান্ তং সুসংৱাদং প্ৰচাৰযিতুং পৃথক্কৃত আহূতঃ প্ৰেৰিতশ্চ প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য সেৱকো যঃ পৌলঃ
2 ౨ పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది.
২স ৰোমানগৰস্থান্ ঈশ্ৱৰপ্ৰিযান্ আহূতাংশ্চ পৱিত্ৰলোকান্ প্ৰতি পত্ৰং লিখতি|
3 ౩ మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
৩অস্মাকং স প্ৰভু ৰ্যীশুঃ খ্ৰীষ্টঃ শাৰীৰিকসম্বন্ধেন দাযূদো ৱংশোদ্ভৱঃ
4 ౪ దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు.
৪পৱিত্ৰস্যাত্মনঃ সম্বন্ধেন চেশ্ৱৰস্য প্ৰভাৱৱান্ পুত্ৰ ইতি শ্মশানাৎ তস্যোত্থানেন প্ৰতিপন্নং|
5 ౫ యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది.
৫অপৰং যেষাং মধ্যে যীশুনা খ্ৰীষ্টেন যূযমপ্যাহূতাস্তে ঽন্যদেশীযলোকাস্তস্য নাম্নি ৱিশ্ৱস্য নিদেশগ্ৰাহিণো যথা ভৱন্তি
6 ౬ ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము.
৬তদভিপ্ৰাযেণ ৱযং তস্মাদ্ অনুগ্ৰহং প্ৰেৰিতৎৱপদঞ্চ প্ৰাপ্তাঃ|
7 ౭ వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
৭তাতেনাস্মাকম্ ঈশ্ৱৰেণ প্ৰভুণা যীশুখ্ৰীষ্টেন চ যুষ্মভ্যম্ অনুগ্ৰহঃ শান্তিশ্চ প্ৰদীযেতাং|
8 ౮ మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.
৮প্ৰথমতঃ সৰ্ৱ্ৱস্মিন্ জগতি যুষ্মাকং ৱিশ্ৱাসস্য প্ৰকাশিতৎৱাদ্ অহং যুষ্মাকং সৰ্ৱ্ৱেষাং নিমিত্তং যীশুখ্ৰীষ্টস্য নাম গৃহ্লন্ ঈশ্ৱৰস্য ধন্যৱাদং কৰোমি|
9 ౯ ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి.
৯অপৰম্ ঈশ্ৱৰস্য প্ৰসাদাদ্ বহুকালাৎ পৰং সাম্প্ৰতং যুষ্মাকং সমীপং যাতুং কথমপি যৎ সুযোগং প্ৰাপ্নোমি, এতদৰ্থং নিৰন্তৰং নামান্যুচ্চাৰযন্ নিজাসু সৰ্ৱ্ৱপ্ৰাৰ্থনাসু সৰ্ৱ্ৱদা নিৱেদযামি,
১০এতস্মিন্ যমহং তৎপুত্ৰীযসুসংৱাদপ্ৰচাৰণেন মনসা পৰিচৰামি স ঈশ্ৱৰো মম সাক্ষী ৱিদ্যতে|
11 ౧౧ మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.
১১যতো যুষ্মাকং মম চ ৱিশ্ৱাসেন ৱযম্ উভযে যথা শান্তিযুক্তা ভৱাম ইতি কাৰণাদ্
১২যুষ্মাকং স্থৈৰ্য্যকৰণাৰ্থং যুষ্মভ্যং কিঞ্চিৎপৰমাৰ্থদানদানায যুষ্মান্ সাক্ষাৎ কৰ্ত্তুং মদীযা ৱাঞ্ছা|
13 ౧౩ సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష.
১৩হে ভ্ৰাতৃগণ ভিন্নদেশীযলোকানাং মধ্যে যদ্ৱৎ তদ্ৱদ্ যুষ্মাকং মধ্যেপি যথা ফলং ভুঞ্জে তদভিপ্ৰাযেণ মুহুৰ্মুহু ৰ্যুষ্মাকং সমীপং গন্তুম্ উদ্যতোঽহং কিন্তু যাৱদ্ অদ্য তস্মিন্ গমনে মম ৱিঘ্নো জাত ইতি যূযং যদ্ অজ্ঞাতাস্তিষ্ঠথ তদহম্ উচিতং ন বুধ্যে|
14 ౧౪ గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను.
১৪অহং সভ্যাসভ্যানাং ৱিদ্ৱদৱিদ্ৱতাঞ্চ সৰ্ৱ্ৱেষাম্ ঋণী ৱিদ্যে|
15 ౧౫ కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.
১৫অতএৱ ৰোমানিৱাসিনাং যুষ্মাকং সমীপেঽপি যথাশক্তি সুসংৱাদং প্ৰচাৰযিতুম্ অহম্ উদ্যতোস্মি|
16 ౧౬ సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.
১৬যতঃ খ্ৰীষ্টস্য সুসংৱাদো মম লজ্জাস্পদং নহি স ঈশ্ৱৰস্য শক্তিস্ৱৰূপঃ সন্ আ যিহূদীযেভ্যো ঽন্যজাতীযান্ যাৱৎ সৰ্ৱ্ৱজাতীযানাং মধ্যে যঃ কশ্চিদ্ তত্ৰ ৱিশ্ৱসিতি তস্যৈৱ ত্ৰাণং জনযতি|
17 ౧౭ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
১৭যতঃ প্ৰত্যযস্য সমপৰিমাণম্ ঈশ্ৱৰদত্তং পুণ্যং তৎসুসংৱাদে প্ৰকাশতে| তদধি ধৰ্ম্মপুস্তকেপি লিখিতমিদং "পুণ্যৱান্ জনো ৱিশ্ৱাসেন জীৱিষ্যতি"|
18 ౧౮ ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.
১৮অতএৱ যে মানৱাঃ পাপকৰ্ম্মণা সত্যতাং ৰুন্ধন্তি তেষাং সৰ্ৱ্ৱস্য দুৰাচৰণস্যাধৰ্ম্মস্য চ ৱিৰুদ্ধং স্ৱৰ্গাদ্ ঈশ্ৱৰস্য কোপঃ প্ৰকাশতে|
19 ౧౯ ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు.
১৯যত ঈশ্ৱৰমধি যদ্যদ্ জ্ঞেযং তদ্ ঈশ্ৱৰঃ স্ৱযং তান্ প্ৰতি প্ৰকাশিতৱান্ তস্মাৎ তেষাম্ অগোচৰং নহি|
20 ౨౦ ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు. (aïdios )
২০ফলতস্তস্যানন্তশক্তীশ্ৱৰৎৱাদীন্যদৃশ্যান্যপি সৃষ্টিকালম্ আৰভ্য কৰ্ম্মসু প্ৰকাশমানানি দৃশ্যন্তে তস্মাৎ তেষাং দোষপ্ৰক্ষালনস্য পন্থা নাস্তি| (aïdios )
21 ౨౧ వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.
২১অপৰম্ ঈশ্ৱৰং জ্ঞাৎৱাপি তে তম্ ঈশ্ৱৰজ্ঞানেন নাদ্ৰিযন্ত কৃতজ্ঞা ৱা ন জাতাঃ; তস্মাৎ তেষাং সৰ্ৱ্ৱে তৰ্কা ৱিফলীভূতাঃ, অপৰঞ্চ তেষাং ৱিৱেকশূন্যানি মনাংসি তিমিৰে মগ্নানি|
22 ౨౨ తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.
২২তে স্ৱান্ জ্ঞানিনো জ্ঞাৎৱা জ্ঞানহীনা অভৱন্
23 ౨౩ వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.
২৩অনশ্ৱৰস্যেশ্ৱৰস্য গৌৰৱং ৱিহায নশ্ৱৰমনুষ্যপশুপক্ষ্যুৰোগামিপ্ৰভৃতেৰাকৃতিৱিশিষ্টপ্ৰতিমাস্তৈৰাশ্ৰিতাঃ|
24 ౨౪ ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు.
২৪ইত্থং ত ঈশ্ৱৰস্য সত্যতাং ৱিহায মৃষামতম্ আশ্ৰিতৱন্তঃ সচ্চিদানন্দং সৃষ্টিকৰ্ত্তাৰং ত্যক্ত্ৱা সৃষ্টৱস্তুনঃ পূজাং সেৱাঞ্চ কৃতৱন্তঃ; (aiōn )
25 ౨౫ వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు. (aiōn )
২৫ইতি হেতোৰীশ্ৱৰস্তান্ কুক্ৰিযাযাং সমৰ্প্য নিজনিজকুচিন্তাভিলাষাভ্যাং স্ৱং স্ৱং শৰীৰং পৰস্পৰম্ অপমানিতং কৰ্ত্তুম্ অদদাৎ|
26 ౨౬ ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
২৬ঈশ্ৱৰেণ তেষু ক্ৱভিলাষে সমৰ্পিতেষু তেষাং যোষিতঃ স্ৱাভাৱিকাচৰণম্ অপহায ৱিপৰীতকৃত্যে প্ৰাৱৰ্ত্তন্ত;
27 ౨౭ అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
২৭তথা পুৰুষা অপি স্ৱাভাৱিকযোষিৎসঙ্গমং ৱিহায পৰস্পৰং কামকৃশানুনা দগ্ধাঃ সন্তঃ পুমাংসঃ পুংভিঃ সাকং কুকৃত্যে সমাসজ্য নিজনিজভ্ৰান্তেঃ সমুচিতং ফলম্ অলভন্ত|
28 ౨౮ వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.
২৮তে স্ৱেষাং মনঃস্ৱীশ্ৱৰায স্থানং দাতুম্ অনিচ্ছুকাস্ততো হেতোৰীশ্ৱৰস্তান্ প্ৰতি দুষ্টমনস্কৎৱম্ অৱিহিতক্ৰিযৎৱঞ্চ দত্তৱান্|
29 ౨౯ వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
২৯অতএৱ তে সৰ্ৱ্ৱে ঽন্যাযো ৱ্যভিচাৰো দুষ্টৎৱং লোভো জিঘাংসা ঈৰ্ষ্যা ৱধো ৱিৱাদশ্চাতুৰী কুমতিৰিত্যাদিভি ৰ্দুষ্কৰ্ম্মভিঃ পৰিপূৰ্ণাঃ সন্তঃ
30 ౩౦ వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు,
৩০কৰ্ণেজপা অপৱাদিন ঈশ্ৱৰদ্ৱেষকা হিংসকা অহঙ্কাৰিণ আত্মশ্লাঘিনঃ কুকৰ্ম্মোৎপাদকাঃ পিত্ৰোৰাজ্ঞালঙ্ঘকা
31 ౩౧ మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు.
৩১অৱিচাৰকা নিযমলঙ্ঘিনঃ স্নেহৰহিতা অতিদ্ৱেষিণো নিৰ্দযাশ্চ জাতাঃ|
32 ౩౨ ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
৩২যে জনা এতাদৃশং কৰ্ম্ম কুৰ্ৱ্ৱন্তি তএৱ মৃতিযোগ্যা ঈশ্ৱৰস্য ৱিচাৰমীদৃশং জ্ঞাৎৱাপি ত এতাদৃশং কৰ্ম্ম স্ৱযং কুৰ্ৱ্ৱন্তি কেৱলমিতি নহি কিন্তু তাদৃশকৰ্ম্মকাৰিষু লোকেষ্ৱপি প্ৰীযন্তে|