< ప్రకటన గ్రంథము 1 >

1 ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు.
yat prakAzitaM vAkyam IzvaraH svadAsAnAM nikaTaM zIghramupasthAsyantInAM ghaTanAnAM darzanArthaM yIzukhrISTe samarpitavAn tat sa svIyadUtaM preSya nijasevakaM yohanaM jJApitavAn|
2 యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్షాన్ని గురించీ తాను చూసినదానంతటికీ సాక్షిగా ఉన్నాడు.
sa cezvarasya vAkye khrISTasya sAkSye ca yadyad dRSTavAn tasya pramANaM dattavAn|
3 ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
etasya bhaviSyadvaktRgranthasya vAkyAnAM pAThakaH zrotArazca tanmadhye likhitAjJAgrAhiNazca dhanyA yataH sa kAlaH sannikaTaH|
4 ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ,
yohan AziyAdezasthAH sapta samitIH prati patraM likhati| yo varttamAno bhUto bhaviSyaMzca ye ca saptAtmAnastasya siMhAsanasya sammukhe tiSThanti
5 నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు.
yazca yIzukhrISTo vizvastaH sAkSI mRtAnAM madhye prathamajAto bhUmaNDalastharAjAnAm adhipatizca bhavati, etebhyo 'nugrahaH zAntizca yuSmAsu varttatAM|
6 మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక! (aiōn g165)
yo 'smAsu prItavAn svarudhireNAsmAn svapApebhyaH prakSAlitavAn tasya piturIzvarasya yAjakAn kRtvAsmAn rAjavarge niyuktavAMzca tasmin mahimA parAkramazcAnantakAlaM yAvad varttatAM| Amen| (aiōn g165)
7 చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.
pazyata sa meghairAgacchati tenaikaikasya cakSustaM drakSyati ye ca taM viddhavantaste 'pi taM vilokiSyante tasya kRte pRthivIsthAH sarvve vaMzA vilapiSyanti| satyam Amen|
8 “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
varttamAno bhUto bhaviSyaMzca yaH sarvvazaktimAn prabhuH paramezvaraH sa gadati, ahameva kaH kSazcArthata Adirantazca|
9 మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.
yuSmAkaM bhrAtA yIzukhrISTasya klezarAjyatitikSANAM sahabhAgI cAhaM yohan Izvarasya vAkyaheto ryIzukhrISTasya sAkSyahetozca pAtmanAmaka upadvIpa AsaM|
10 ౧౦ ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం
tatra prabho rdine AtmanAviSTo 'haM svapazcAt tUrIdhvanivat mahAravam azrauSaM,
11 ౧౧ నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను.
tenoktam, ahaM kaH kSazcArthata Adirantazca| tvaM yad drakSyasi tad granthe likhitvAziyAdezasthAnAM sapta samitInAM samIpam iphiSaM smurNAM thuyAtIrAM sArddiM philAdilphiyAM lAyadIkeyAJca preSaya|
12 ౧౨ అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను.
tato mayA sambhASamANasya kasya ravaH zrUyate taddarzanArthaM mukhaM parAvarttitaM tat parAvartya svarNamayAH sapta dIpavRkSA dRSTAH|
13 ౧౩ ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
teSAM sapta dIpavRkSANAM madhye dIrghaparicchadaparihitaH suvarNazRGkhalena veSTitavakSazca manuSyaputrAkRtireko janastiSThati,
14 ౧౪ ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
tasya ziraH kezazca zvetameSalomAnIva himavat zretau locane vahnizikhAsame
15 ౧౫ ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది.
caraNau vahnikuNDetApitasupittalasadRzau ravazca bahutoyAnAM ravatulyaH|
16 ౧౬ ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
tasya dakSiNahaste sapta tArA vidyante vaktrAcca tIkSNo dvidhAraH khaGgo nirgacchati mukhamaNDalaJca svatejasA dedIpyamAnasya sUryyasya sadRzaM|
17 ౧౭ నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే.
taM dRSTvAhaM mRtakalpastaccaraNe patitastataH svadakSiNakaraM mayi nidhAya tenoktam mA bhaiSIH; aham Adirantazca|
18 ౧౮ జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. (aiōn g165, Hadēs g86)
aham amarastathApi mRtavAn kintu pazyAham anantakAlaM yAvat jIvAmi| Amen| mRtyoH paralokasya ca kuJjikA mama hastagatAH| (aiōn g165, Hadēs g86)
19 ౧౯ ఇప్పుడు నువ్వు చూసిన సంగతులనూ ప్రస్తుతమున్న సంగతులనూ, వీటి తరువాత జరగబోయే సంగతులనూ రాయి.
ato yad bhavati yaccetaH paraM bhaviSyati tvayA dRSTaM tat sarvvaM likhyatAM|
20 ౨౦ నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
mama dakSiNahaste sthitA yAH sapta tArA ye ca svarNamayAH sapta dIpavRkSAstvayA dRSTAstattAtparyyamidaM tAH sapta tArAH sapta samitInAM dUtAH suvarNamayAH sapta dIpavRkSAzca sapta samitayaH santi|

< ప్రకటన గ్రంథము 1 >