< ప్రకటన గ్రంథము 9 >
1 ౧ ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది. (Abyssos )
И като затръби петият ангел, видях една звезда паднала на земята от небето, на която се даде ключа от бездънната пропаст. (Abyssos )
2 ౨ అతడు లోతైన, అంతు లేని ఆ అగాధాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్టు దట్టమైన పొగ ఆ అగాధంలో నుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది. గాలి కూడా నల్లబడింది. (Abyssos )
И тя отвори бездънната пропаст; и дим се издигна от пропастта като дим от голяма пещ; и слънцето и въздуха потъмняха от дима на пропастта. (Abyssos )
3 ౩ ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదికి వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తిలాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది.
И от дима излязоха скакалци по земята; и даде им се сила, както е силата, що имат земните скорпии.
4 ౪ నుదుటి మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికి గానీ, మొక్కలకు గానీ, చెట్లకు గానీ ఎలాంటి హని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఉంది.
Но им се заръча да не повредят тревата по земята, нито някое зеленище, нито някое дърво, а само такива човеци, които нямат Божия печат на челата си.
5 ౫ ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలు కుట్టినపుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది.
И позволи им се, не да убиват тия, но да ги мъчат пет месеца; и мъката беше като мъка от скорпия, когато ожили човека.
6 ౬ ఆ రోజుల్లో మనుషులు చావుకోసం వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు గానీ మరణం వారి దగ్గరనుంచి పారిపోతుంది.
През ония дни човеците ще потърсят смъртта, но никак няма да я намерят; и ще пожелаят да умрат, но смъртта ще побегне от тях.
7 ౭ ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సన్నద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలలపై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి.
И скакалците приличат на коне, приготвени за война; и на главите им имаше като корони подобни на злато, и лицата им бяха като човешки лица.
8 ౮ వాటికి వెంట్రుకలున్నాయి. అవి స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి.
А те имаха коса като косата на жените, и зъбите им бяха като на лъв.
9 ౯ ఇనప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.
При това, имаха нагръдници като железни нагръдници; и шумът от крилата им беше като шум от колесници с много коне, когато тичат на бой.
10 ౧౦ ప్రతిదానికీ తేళ్ళకు ఉన్నట్టు తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హని చేయడానికి వాటికి అధికారం ఉంది.
Имаха и опашки подобни на скорпинии, и жила; а в опашките си имаха сила да повреждат човеците пет месеца.
11 ౧౧ వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు లోతైన అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను (‘విధ్వంసకుడు’ అని ఈ పేరుకి అర్థం). (Abyssos )
Имаха над себе си за цар ангела на бездната, който по еврейски се нарича Авадон, а на гръцки се именува Аполион (Т. е.: Погубител ). (Abyssos )
12 ౧౨ మొదటి యాతన ముగిసింది. చూడు, ఈ విషయాలు జరిగిన తరువాత మరో రెండు యాతనలు కలుగుతాయి.
Едното горко мина, ето, още две горки идат подир това.
13 ౧౩ ఆరవ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది.
И като затръби шестият ангел, чух един глас от роговете на златния олтар, който беше пред Бога,
14 ౧౪ ఆ స్వరం “మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు” అని బాకా పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పడం విన్నాను.
че някой казваше на шестия ангел, у когото беше тръбата: Развържи четирите ангела, които са вързани при голямата река Ефрат.
15 ౧౫ మనుషుల్లో మూడవ భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరచిన ఆ నలుగురు దూతలను విడిచిపెట్టారు.
И развързаха се четирите ангела, които бяха приготвени за тоя час и ден и месец и година, за да убият третата част от човеците.
16 ౧౬ సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.
И числото на воюващите конници беше двесте милиона; аз чух числото им.
17 ౧౭ నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చీ, వాటి పైన ఉన్న సైనిక దళం గూర్చీ నేనేం చూశానంటే, గుర్రాలూ, సైనికులూ ధరించిన కవచాలు నిప్పులాటి ఎరుపూ, చిక్కటి నీలం, గంధకంలాటి పసుపు రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళలో నుండి అగ్ని, పొగ, గంధకం వెళ్ళగక్కుతున్నాయి.
И конете във видението и яздещите на тях ми се видяха такива: те носеха като огнени, яцинтови и жупелни нагръдници; и главите на конете бяха като глави на лъвове, и от устата им излизаше огън, дим и жупел.
18 ౧౮ వాటి నోళ్లలో నుండి బయటకు వస్తున్న అగ్ని, పొగ, గంధకం అనే మూడు అనర్థాల వలన మనుషుల్లో మూడవ వంతు జనాభా చనిపోయారు.
От тия три язви,
19 ౧౯ ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకల్లోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు తలలున్న పాముల్లా ఉన్నాయి. అవి వాటితో మనుషులను గాయపరుస్తాయి.
Защото силата на конете бе в устата им и в опашките им; понеже опашките им приличаха на змии и имаха глави, и с тях повреждаха.
20 ౨౦ ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.
И останалите човеци, които не бяха избити от тия язви, не се покаяха от делата на ръцете си, та да се не кланят вече на бесовете и на златните, сребърните, медните, каменните и дървените идоли, които не могат нито да виждат, нито да чуват, нито да ходят;
21 ౨౧ అలాగే వారు సాగిస్తున్న నరహత్యలనూ, మాయమంత్రాలనూ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.
също не се покаяха нито от убийствата си, нито от чародеянията си, нито от боледуванията си, нито от кражбите си.