< ప్రకటన గ్రంథము 8 >

1 ఆయన ఏడవ సీలు తెరిచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది.
וכפתחו החותם השביעי ותהי דממה בשמים כחצי שעה׃
2 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు.
וארא את שבעת המלאכים אשר עמדו לפני האלהים וינתנו להם שבעה שופרות׃
3 మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు.
ויבא מלאך אחר ויגש אל המזבח ומחתת זהב בידו ותנתן לו קטרת הרבה לתתה עם תפלות כל הקדשים על מזבח הזהב אשר לפני הכסא׃
4 అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి.
ויעל עשן הקטרת עם תפלות הקדשים מיד המלאך לפני אלהים׃
5 ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
ויקח המלאך את המחתה וימלאה אש מעל המזבח וישלך על הארץ ויהי קולות ורעמים וברקים ורעש׃
6 అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.
ושבעה המלאכים ההם אשר בידם שבעת השופרות התעתדו לתקע׃
7 మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది.
והמלאך הראשון תקע בשופר ויהי ברד ואש בלולים בדם ותשלך ארצה ותשרף שלישית העץ וכל ירק עשב נשרף׃
8 రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది.
והמלאך השני תקע בשופר והנה כדמות הר גדול בער באש השלך אל תוך הים ותהי שלישית הים לדם׃
9 సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చచ్చిపోయాయి. ఓడల్లో మూడోభాగం నాశనం అయ్యాయి.
ותמת שלישית כל נפש חיה אשר בים ושלישית האניות נשחתה׃
10 ౧౦ మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.
והמלאך השלישי תקע בשופר ויפל מן השמים כוכב גדול בער כלפיד ויפל על שלישית הנהרות ועל מעינות המים׃
11 ౧౧ ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు.
ושם הכוכב נקרא לענה ותהי שלישית המים ללענה ורבים מבני אדם מתו מן המים כי מרים היו׃
12 ౧౨ నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.
והמלאך הרביעי תקע בשופר ותכה שלישית השמש ושלישית הירח ושלישית הכוכבים למען תחשך שלישיתם והיום לא יאיר שלישיתו וכן גם הלילה׃
13 ౧౩ తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ “ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!” అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.
וארא ואשמע מלאך אחד מעופף במרום הרקיע הקורא בקול גדול אוי אוי אוי לישבי הארץ משאר קלות שופר שלשת המלאכים העתידים לתקע׃

< ప్రకటన గ్రంథము 8 >