< ప్రకటన గ్రంథము 7 >

1 ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు.
After this, I saw four angels standing on the four corners of the earth, restraining the four winds of the earth, so that no wind should blow over the earth, or over the sea, or against any tree.
2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా
And, in the east, I saw another angel, ascending, holding the seal of the living God; and he cried in a loud voice to the four angels, to whom there had been given power to harm the earth and the sea –
3 “మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు.
‘Do not harm the earth, or the sea, or the trees, until we have sealed the servants of our God on their foreheads.’
4 సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందినవారి సంఖ్య 1, 44,000.
I heard, too, the number of those who had been sealed. It was one hundred and forty-four thousand; and they were from every tribe of the Israelites.
5 గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య. యూదా గోత్రంలో 12,000. రూబేను గోత్రంలో 12,000. గాదు గోత్రంలో 12,000.
From the tribe of Judah twelve thousand were sealed, from the tribe of Reuben twelve thousand, from the tribe of Gad twelve thousand,
6 ఆషేరు గోత్రంలో 12,000. నఫ్తాలి గోత్రంలో 12,000. మనష్షే గోత్రంలో 12,000.
from the tribe of Asher twelve thousand, from the tribe of Napthali twelve thousand, from the tribe of Manasseh twelve thousand,
7 షిమ్యోను గోత్రంలో 12,000. లేవి గోత్రంలో 12,000. ఇశ్శాఖారు గోత్రంలో 12,000.
from the tribe of Simeon twelve thousand, from the tribe of Levi twelve thousand, from the tribe of Issachar twelve thousand,
8 జెబూలూను గోత్రంలో 12,000. యోసేపు గోత్రంలో 12,000. బెన్యామీను గోత్రంలో 12,000.
from the tribe of Zebulon twelve thousand, from the tribe of Joseph twelve thousand, from the tribe of Benjamin twelve thousand were sealed.
9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు.
After this, in my vision, I saw a vast throng which no one could number, of people from every nation and of all tribes, and peoples, and languages. They stood in front of the throne and in front of the Lamb, robed in white, holding palm branches in their hands.
10 ౧౦ వీరంతా కలసి, “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
And they are crying in a loud voice – ‘Salvation be ascribed to our God who is seated on his throne and to the Lamb.’
11 ౧౧ దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,
And all the angels were standing around the throne and the elders and the four creatures, and they prostrated themselves on their faces in front of the throne and worshiped God,
12 ౧౨ “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు. (aiōn g165)
saying – ‘Amen. Blessing and praise, and wisdom, and thanksgiving, and honor, and power, and might be ascribed to our God for ever and ever. Amen.’ (aiōn g165)
13 ౧౩ అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
Then one of the elders turned to me and said ‘Who are these who are robed in white? And where did they come from?’
14 ౧౪ అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు.
‘My Lord,’ I answered, ‘it is you who know.’ ‘These,’ he said, ‘are they who come through the Great Persecution; they washed their robes white in the blood of the Lamb.
15 ౧౫ అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
And therefore it is that they are before the throne of God, and are serving him day and night in his Temple; and he who is seated on the throne will shelter them.
16 ౧౬ వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.
Never again will they be hungry, never again will they be thirsty, nor will the sun smite them, nor any scorching heat;
17 ౧౭ ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”
for the Lamb that stands in the space before the throne will be their shepherd, and will lead them to life-giving springs of water; and God will wipe away all tears from their eyes.’

< ప్రకటన గ్రంథము 7 >