< ప్రకటన గ్రంథము 5 >

1 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది.
És láték annak jobbkezében, a ki a királyiszékben üle, egy könyvet, a mely be volt írva belől és hátul, és le volt pecsételve hét pecséttel.
2 బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.
És láték egy erős angyalt, a ki nagy szóval kiálta: Ki volna méltó arra, hogy felnyissa a könyvet, és felbontsa annak pecséteit?
3 కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.
És senki, sem mennyen, sem földön, sem föld alatt, nem tudta a könyvet felnyitni, sem ránézni.
4 ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
Én azért igen sírok vala, hogy senki nem találtaték méltónak a könyv felnyitására és elolvasására, a ránézésre sem:
5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు.
És egy a Vének közül monda nékem: Ne sírj: ímé győzött a Júda nemzetségéből való oroszlán, Dávid gyökere, hogy felnyissa a könyvet és felbontsa annak hét pecsétét.
6 సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.
És láték a királyiszék és a négy lelkes állat között és a Vének között egy Bárányt állani, mint egy megölöttet, hét szarva és hét szeme vala, a mi az Istennek hét Lelke, a mely elküldetett az egész földre.
7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
És eljöve és elvevé a könyvet a királyiszékben ülőnek jobbkezéből.
8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
És mikor elvevé a könyvet, a négy lelkes állat és a huszonnégy Vén leborula a Bárány előtt, mindeniknél hárfák és aranypoharak lévén, jóillatokkal tele, a mik a szentek imádságai.
9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు.
És éneklének új éneket, mondván: Méltó vagy, hogy elvedd a könyvet és megnyisd annak pecséteit: mert megölettél, és megváltottál minket Istennek a te véred által, minden ágazatból és nyelvből és népből és nemzetből,
10 ౧౦ మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.
És tettél minket a mi Istenünknek királyokká és papokká; és uralkodunk a földön.
11 ౧౧ ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది.
És látám, és hallám a királyiszék, a lelkes állatok, és a Vének körül sok angyalnak szavát; és az ő számuk tízezerszer tízezer és ezerszer ezer vala;
12 ౧౨ వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.
Nagy szóval ezt mondván: Méltó a megöletett Bárány, hogy vegyen erőt és gazdagságot és bölcseséget és hatalmasságot és tisztességet és dicsőséget és áldást.
13 ౧౩ అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను. (aiōn g165)
Sőt hallám, hogy minden teremtett állat, a mely van a mennyben és a földön, és a föld alatt és a tengerben, és minden, a mi ezekben van, ezt mondja vala: A királyiszékben ülőnek és a Báránynak áldás és tisztesség és dicsőség és hatalom örökkön örökké. (aiōn g165)
14 ౧౪ ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.
És a négy lelkes állat monda: Ámen. És a huszonnégy Vén leborult és imádá az örökkön örökké élőt.

< ప్రకటన గ్రంథము 5 >