< ప్రకటన గ్రంథము 22 +

1 అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ,
অনন্তৰং স স্ফটিকৱৎ নিৰ্ম্মলম্ অমৃততোযস্য স্ৰোতো মাম্ অউৰ্শযৎ তদ্ ঈশ্ৱৰস্য মেষশাৱকস্য চ সিংহাসনাৎ নিৰ্গচ্ছতি|
2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
নগৰ্য্যা মাৰ্গমধ্যে তস্যা নদ্যাঃ পাৰ্শ্ৱযোৰমৃতৱৃক্ষা ৱিদ্যন্তে তেষাং দ্ৱাদশফলানি ভৱন্তি, একৈকো ৱৃক্ষঃ প্ৰতিমাসং স্ৱফলং ফলতি তদ্ৱৃক্ষপত্ৰাণি চান্যজাতীযানাম্ আৰোগ্যজনকানি|
3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు.
অপৰং কিমপি শাপগ্ৰস্তং পুন ৰ্ন ভৱিষ্যতি তস্যা মধ্য ঈশ্ৱৰস্য মেষশাৱকস্য চ সিংহাসনং স্থাস্যতি তস্য দাসাশ্চ তং সেৱিষ্যন্তে|
4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది.
তস্য ৱদনদৰ্শনং প্ৰাপ্স্যন্তি ভালেষু চ তস্য নাম লিখিতং ভৱিষ্যতি|
5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు. (aiōn g165)
তদানীং ৰাত্ৰিঃ পুন ৰ্ন ভৱিষ্যতি যতঃ প্ৰভুঃ পৰমেশ্ৱৰস্তান্ দীপযিষ্যতি তে চানন্তকালং যাৱদ্ ৰাজৎৱং কৰিষ্যন্তে| (aiōn g165)
6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు, “ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు.”
অনন্তৰং স মাম্ অৱদৎ, ৱাক্যানীমানি ৱিশ্ৱাস্যানি সত্যানি চ, অচিৰাদ্ যৈ ৰ্ভৱিতৱ্যং তানি স্ৱদাসান্ জ্ঞাপযিতুং পৱিত্ৰভৱিষ্যদ্ৱাদিনাং প্ৰভুঃ পৰমেশ্ৱৰঃ স্ৱদূতং প্ৰেষিতৱান্|
7 “చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు.”
পশ্যাহং তূৰ্ণম্ আগচ্ছামি, এতদ্গ্ৰন্থস্য ভৱিষ্যদ্ৱাক্যানি যঃ পালযতি স এৱ ধন্যঃ|
8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను.
যোহনহম্ এতানি শ্ৰুতৱান্ দৃষ্টৱাংশ্চাস্মি শ্ৰুৎৱা দৃষ্ট্ৱা চ তদ্দৰ্শকদূতস্য প্ৰণামাৰ্থং তচ্চৰণযোৰন্তিকে ঽপতং|
9 అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.
ততঃ স মাম্ অৱদৎ সাৱধানো ভৱ মৈৱং কৃৰু, ৎৱযা তৱ ভ্ৰাতৃভি ৰ্ভৱিষ্যদ্ৱাদিভিৰেতদ্গ্ৰন্থস্থৱাক্যপালনকাৰিভিশ্চ সহদাসো ঽহং| ৎৱম্ ঈশ্ৱৰং প্ৰণম|
10 ౧౦ అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, “ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
১০স পুন ৰ্মাম্ অৱদৎ, এতদ্গ্ৰন্থস্থভৱিষ্যদ্ৱাক্যানি ৎৱযা ন মুদ্ৰাঙ্কযিতৱ্যানি যতঃ সমযো নিকটৱৰ্ত্তী|
11 ౧౧ అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.
১১অধৰ্ম্মাচাৰ ইতঃ পৰমপ্যধৰ্ম্মম্ আচৰতু, অমেধ্যাচাৰ ইতঃ পৰমপ্যমেধ্যম্ আচৰতু ধৰ্ম্মাচাৰ ইতঃ পৰমপি ধৰ্ম্মম্ আচৰতু পৱিত্ৰাচাৰশ্চেতঃ পৰমপি পৱিত্ৰম্ আচৰতু|
12 ౧౨ “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
১২পশ্যাহং তূৰ্ণম্ আগচ্ছামি, একৈকস্মৈ স্ৱক্ৰিযানুযাযিফলদানাৰ্থং মদ্দাতৱ্যফলং মম সমৱৰ্ত্তি|
13 ౧౩ ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.
১৩অহং কঃ ক্ষশ্চ প্ৰথমঃ শেষশ্চাদিৰন্তশ্চ|
14 ౧౪ జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.
১৪অমুতৱৃক্ষস্যাধিকাৰপ্ৰাপ্ত্যৰ্থং দ্ৱাৰৈ ৰ্নগৰপ্ৰৱেশাৰ্থঞ্চ যে তস্যাজ্ঞাঃ পালযন্তি ত এৱ ধন্যাঃ|
15 ౧౫ పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.
১৫কুক্কুৰৈ ৰ্মাযাৱিভিঃ পুঙ্গামিভি ৰ্নৰহন্তৃভি ৰ্দেৱাৰ্চ্চকৈঃ সৰ্ৱ্ৱৈৰনৃতে প্ৰীযমাণৈৰনৃতাচাৰিভিশ্চ বহিঃ স্থাতৱ্যং|
16 ౧౬ యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.
১৬মণ্ডলীষু যুষ্মভ্যমেতেষাং সাক্ষ্যদানাৰ্থং যীশুৰহং স্ৱদূতং প্ৰেষিতৱান্, অহমেৱ দাযূদো মূলং ৱংশশ্চ, অহং তেজোমযপ্ৰভাতীযতাৰাস্ৱৰূপঃ|
17 ౧౭ “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.”
১৭আত্মা কন্যা চ কথযতঃ, ৎৱযাগম্যতাং| শ্ৰোতাপি ৱদতু, আগম্যতামিতি| যশ্চ তৃষাৰ্ত্তঃ স আগচ্ছতু যশ্চেচ্ছতি স ৱিনা মূল্যং জীৱনদাযি জলং গৃহ্লাতু|
18 ౧౮ ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు.
১৮যঃ কশ্চিদ্ এতদ্গ্ৰন্থস্থভৱিষ্যদ্ৱাক্যানি শৃণোতি তস্মা অহং সাক্ষ্যমিদং দদামি, কশ্চিদ্ যদ্যপৰং কিমপ্যেতেষু যোজযতি তৰ্হীশ্ৱৰোগ্ৰন্থেঽস্মিন্ লিখিতান্ দণ্ডান্ তস্মিন্নেৱ যোজযিষ্যতি|
19 ౧౯ ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవ వృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.
১৯যদি চ কশ্চিদ্ এতদ্গ্ৰন্থস্থভৱিষ্যদ্ৱাক্যেভ্যঃ কিমপ্যপহৰতি তৰ্হীশ্ৱৰো গ্ৰন্থে ঽস্মিন্ লিখিতাৎ জীৱনৱৃক্ষাৎ পৱিত্ৰনগৰাচ্চ তস্যাংশমপহৰিষ্যতি|
20 ౨౦ ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు. ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.
২০এতৎ সাক্ষ্যং যো দদাতি স এৱ ৱক্তি সত্যম্ অহং তূৰ্ণম্ আগচ্ছামি| তথাস্তু| প্ৰভো যীশো, আগম্যতাং ভৱতা|
21 ౨౧ ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్‌.
২১অস্মাকং প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্যানুগ্ৰহঃ সৰ্ৱ্ৱেষু যুষ্মাসু ৱৰ্ত্ততাং| আমেন্|

< ప్రకటన గ్రంథము 22 +