< ప్రకటన గ్రంథము 21 >
1 ౧ అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు.
In dusan iri aseseri aso nan une uso, aseseri utuba nan utuba amari sarki uraba udandang.
2 ౨ అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
In iri nipin nilau, urushalima uso, uge sa wa suri aseseri ahira Asere utu une kasi unee uso sa abrka me barki uruma ume.
3 ౩ అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
In kunna nimyiran nidandang ahira ukpanku me nigusa ira! ahira ati cukum ta Asere nigome nan anabu, madi cukuno nan we wadi cukuno anu ame, Asere madi cukuno nigome nan we ma kuri ma cukuno Asere awe.
4 ౪ ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
Madi visi vat maje mawe aje awe, sarki ukasu iwono, nani apuru abit, nani asoo, nani ijasi. Timum me sa tamara.
5 ౫ అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.
Desa ma ciki ukpanku me ma gu, ''irani ma kurzo kondi nyani ya cukuno iso'' magu, ''nyettike barki tize tigeme tuhem tini nan kadure.''
6 ౬ ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
Ma gun me, timum tigeme amara! mi mani alfa nan umega, utuba nan umasirka. Unu kunna uniwe nimei, indi nyeki me ahira ususo umei mivai.
7 ౭ జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
Desa mare aje madi kem timum tigeme, mi idi cukuno Asere ame, me ma cukuno vana um.
8 ౮ పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం. (Limnē Pyr )
Ahira ani yau nan anu zatu hem nan ana madini, nan anu huza anu, nan pebu, nan abere, nan anu makiri, nan vat anu macico, ahira aticukum tuweme. Iwono ukure. (Limnē Pyr )
9 ౯ అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.
Unu indi anyimo ibe ikadura ka Asere inu sunare ma ē ahira am, ma canti muso usunare inti koni tini sunare tumara, ma gu, ''aye aba.'' Indi bezi we une uso, unee uvana ubizara.''
10 ౧౦ ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
Ma zikim anyimo nijoko ma bezum nipin nilau, urushalima, unu tuzzo aseseri ahira Asere.
11 ౧౧ యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది.
Urushalima uzin ninonzo na Asere, uzin masaa kasi apo ikirfi ikang, kasi apo uyasfa, ahuma lau.
12 ౧౨ ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
Uzin nuzunu ujoko udandang, in tina tukum ukirau intini tire, inibe ukirau inire ya Asere atina tukumme. A nyettike tiza ukirau tire tahana Isaraila, atina tukumme.
13 ౧౩ తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
Ana zame tina tukum ti taru, u'arewa tina tukum t taru, ukudu tina tukum ti taru, udizi tina tukum ti taru.
14 ౧౪ ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
Uzunu unipin me uzin nibigirik ukirau inire, aseseri me awuna tiza ta dura ukirau ware avana ubizara.
15 ౧౫ నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
Desa ma boo tize nan mi ma canti ubinang ubata azumo abalbal bati ma batti inpin me, nan tina tukum me nan mazunu me.
16 ౧౬ ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
Ujokoko unioin nan upash me uzi rep. Ma batti nipin me unu binang ubassa me, ma mel madubu ukirau mare ujokoko me, (upash nan ujokoko me nan nuturi me vat u'indi me uni).
17 ౧౭ తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.
Ma kuri ma batti mazunu me, umeki akuri anazi in anu anazi 144, kasi ubatta wa nabu (uge sa une uni imum ubatta ibibe bikadura ka Asere).
18 ౧౮ ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది.
Abari uzunu me unu yasta nipin me inna zumo abalbal ahuma kasi mageni mu kabsa.
19 ౧౯ ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
Aketi unuka uzumu me unusandi ikondi aya apo ikirfi ikang. Nu tuba yasta nu kure sa ttir, nan nu taru agat, nan nu nazi amerald.
20 ౨౦ అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగం.
Nan nu cibi onis, nan nu tasi shida sardiyas, nan nu sunare kirisolat, nan nu wito utari beril, nan nu tara totaz, nan nu kirau kirisotaras, nan nu kirau bi'inde yakinta, nan nu kirau innire ametis.
21 ౨౧ దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
Tina tukum ukirau tire me timum tilubulubu ukirau tini tire, kondi aya ana tukum abara ani intimum tilubu-lubu ti inde me tini. Tina tipin ina zumo abalbal ahuma kasi mageni ma huma.
22 ౨౨ అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
Daki ma iri udenge Asere anyimo anipin me ba, barki sa ugomo Asere, Asere me sa abari vat nan vana ubizara we wani udenge Asere ameme.
23 ౨౩ ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.
Nipin me nida nyara uwui nani upe unya nini masaa ba barki ugongon Asere wamu nya uni masaa. Vana ubizara mani upitila umeme.
24 ౨౪ వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
Anabu wani wuzi tanu anyimo amasaa mani pin m. A gomo unee wadi en ninonzo anyimo ame.
25 ౨౫ రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు.
Wada korso me tina tukum tuwe me unu wui ba, sarki niye abirko me.
26 ౨౬ వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
Wadi en ninonzo na nabu nanu gongon anyimo ame.
27 ౨౭ పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
Imum ima dini ida ribe anyimo ba, nani desa ma wuza imum im'i nan macico. Senke ande sa ma nyettike niza nume anyimo utakarda uvana ubiza cas.