< ప్రకటన గ్రంథము 20 >

1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. (Abyssos g12)
וארא מלאך יורד מן השמים ובידו מפתח התהום וכבל גדול׃ (Abyssos g12)
2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
ויתפש את התנין את הנחש הקדמוני הוא המלשין והוא השטן ויאסרהו לאלף שנים׃
3 వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి. (Abyssos g12)
וישליכהו בתהום ויסגר בעדו ויחתם עליו למען לא ידיח עוד את הגוים עד כלות אלף השנים ואחרי כן יתר לזמן מצער׃ (Abyssos g12)
4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.
וארא כסאות וישבו עליהם והמשפט נתן בידם ונפשות ההרוגים על עדות ישוע ועל דבר האלהים ואשר לא השתחוו לחיה ולצלמה ולא קבלו את תוה על מצחותם ועל ידם ויקומו ויחיו וימלכו עם המשיח אלף שנים׃
5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం.
ושאר המתים לא קמו לחיים עד כלות אלף השנים זאת היא התחיה הראשונה׃
6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
אשרי האיש וקדוש הוא אשר חלקו לקום בתחיה הראשונה באלה לא ישלט המות השני כי אם יהיו כהנים לאלהים ולמשיחו וימלכו אתו אלף שנים׃
7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు.
ואחרי כלות אלף השנים יתר השטן מבית משמרו׃
8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.
ויצא להדיח את הגוים בארבע כנפות הארץ את גוג ומגוג ולקבצם למלחמה אשר מספרם כחול הים׃
9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
ויעלו על מרחבי ארץ ויסבו את מחנה הקדשים ואת העיר החביבה ותרד אש מאת האלהים מן השמים ותאכל אתם׃
10 ౧౦ వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
והשטן אשר הדיחם השלך באגם אש וגפרית אשר שם גם החיה ונביא השקר ויסרו יומם ולילה לעולמי עולמים׃ (aiōn g165, Limnē Pyr g3041 g4442)
11 ౧౧ తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.
וארא כסא לבן וגדול ואת הישב עליו אשר מפניו נסו ארץ ושמים ולא נמצא להם מקום׃
12 ౧౨ చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.
וארא את המתים הקטנים עם הגדלים עמדים לפני הכסא וספרים נפתחים ויפתח ספר אחר אשר הוא ספר החיים וישפטו המתים על פי הכתוב בספרים כמעשיהם׃
13 ౧౩ సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. (Hadēs g86)
ויתן הים את מתיו והמות והשאול נתנו את מתיהם וישפטו איש איש כמעשיהם׃ (Hadēs g86)
14 ౧౪ మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
והמות והשאול השלכו באגם האש והוא המות השני׃ (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
15 ౧౫ జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు. (Limnē Pyr g3041 g4442)
וכל איש אשר לא נמצא כתוב בספר החיים השלך באגם האש׃ (Limnē Pyr g3041 g4442)

< ప్రకటన గ్రంథము 20 >