< ప్రకటన గ్రంథము 2 >

1 “ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే,
ইফিষস্থসমিতে র্দূতং প্রতি ৎৱম্ ইদং লিখ; যো দক্ষিণকরেণ সপ্ত তারা ধারযতি সপ্তানাং সুৱর্ণদীপৱৃক্ষাণাং মধ্যে গমনাগমনে করোতি চ তেনেদম্ উচ্যতে|
2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.
তৱ ক্রিযাঃ শ্রমঃ সহিষ্ণুতা চ মম গোচরাঃ, ৎৱং দুষ্টান্ সোঢুং ন শক্নোষি যে চ প্রেরিতা ন সন্তঃ স্ৱান্ প্রেরিতান্ ৱদন্তি ৎৱং তান্ পরীক্ষ্য মৃষাভাষিণো ৱিজ্ঞাতৱান্,
3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు.
অপরং ৎৱং তিতিক্ষাং ৱিদধাসি মম নামার্থং বহু সোঢৱানসি তথাপি ন পর্য্যক্লাম্যস্তদপি জানামি|
4 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు.
কিঞ্চ তৱ ৱিরুদ্ধং মযৈতৎ ৱক্তৱ্যং যৎ তৱ প্রথমং প্রেম ৎৱযা ৱ্যহীযত|
5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.
অতঃ কুতঃ পতিতো ঽসি তৎ স্মৃৎৱা মনঃ পরাৱর্ত্ত্য পূর্ৱ্ৱীযক্রিযাঃ কুরু ন চেৎ ৎৱযা মনসি ন পরিৱর্ত্তিতে ঽহং তূর্ণম্ আগত্য তৱ দীপৱৃক্ষং স্ৱস্থানাদ্ অপসারযিষ্যামি|
6 అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.
তথাপি তৱেষ গুণো ৱিদ্যতে যৎ নীকলাযতীযলোকানাং যাঃ ক্রিযা অহম্ ঋতীযে তাস্ত্ৱমপি ঋতীযমে|
7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”
যস্য শ্রোত্রং ৱিদ্যতে স সমিতীঃ প্রত্যুচ্যমানাম্ আত্মনঃ কথাং শৃণোতু| যো জনো জযতি তস্মা অহম্ ঈশ্ৱরস্যারামস্থজীৱনতরোঃ ফলং ভোক্তুং দাস্যামি|
8 “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే,
অপরং স্মুর্ণাস্থসমিতে র্দূতং প্রতীদং লিখ; য আদিরন্তশ্চ যো মৃতৱান্ পুনর্জীৱিতৱাংশ্চ তেনেদম্ উচ্যতে,
9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.
তৱ ক্রিযাঃ ক্লেশো দৈন্যঞ্চ মম গোচরাঃ কিন্তু ৎৱং ধনৱানসি যে চ যিহূদীযা ন সন্তঃ শযতানস্য সমাজাঃ সন্তি তথাপি স্ৱান্ যিহূদীযান্ ৱদন্তি তেষাং নিন্দামপ্যহং জানামি|
10 ౧౦ నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.
১০ৎৱযা যো যঃ ক্লেশঃ সোঢৱ্যস্তস্মাৎ মা ভৈষীঃ পশ্য শযতানো যুষ্মাকং পরীক্ষার্থং কাংশ্চিৎ কারাযাং নিক্ষেপ্স্যতি দশ দিনানি যাৱৎ ক্লেশো যুষ্মাসু ৱর্ত্তিষ্যতে চ| ৎৱং মৃত্যুপর্য্যন্তং ৱিশ্ৱাস্যো ভৱ তেনাহং জীৱনকিরীটং তুভ্যং দাস্যামি|
11 ౧౧ చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.”
১১যস্য শ্রোত্রং ৱিদ্যতে স সমিতীঃ প্রত্যুচ্যমানাম্ আত্মনঃ কথাং শৃণোতু| যো জযতি স দ্ৱিতীযমৃত্যুনা ন হিংসিষ্যতে|
12 ౧౨ “పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెబుతున్న సంగతులు.
১২অপরং পর্গামস্থসমিতে র্দূতং প্রতীদং লিখ, যস্তীক্ষ্ণং দ্ৱিধারং খঙ্গং ধারযতি স এৱ ভাষতে|
13 ౧౩ నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.
১৩তৱ ক্রিযা মম গোচরাঃ, যত্র শযতানস্য সিংহাসনং তত্রৈৱ ৎৱং ৱসসি তদপি জানামি| ৎৱং মম নাম ধারযসি মদ্ভক্তেরস্ৱীকারস্ত্ৱযা ন কৃতো মম ৱিশ্ৱাস্যসাক্ষিণ আন্তিপাঃ সমযে ঽপি ন কৃতঃ| স তু যুষ্মন্মধ্যে ঽঘানি যতঃ শযতানস্তত্রৈৱ নিৱসতি|
14 ౧౪ అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు.
১৪তথাপি তৱ ৱিরুদ্ধং মম কিঞ্চিদ্ ৱক্তৱ্যং যতো দেৱপ্রসাদাদনায পরদারগমনায চেস্রাযেলঃ সন্তানানাং সম্মুখ উন্মাথং স্থাপযিতুং বালাক্ যেনাশিক্ষ্যত তস্য বিলিযমঃ শিক্ষাৱলম্বিনস্তৱ কেচিৎ জনাস্তত্র সন্তি|
15 ౧౫ అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు.
১৫তথা নীকলাযতীযানাং শিক্ষাৱলম্বিনস্তৱ কেচিৎ জনা অপি সন্তি তদেৱাহম্ ঋতীযে|
16 ౧౬ కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.
১৬অতো হেতোস্ত্ৱং মনঃ পরিৱর্ত্তয ন চেদহং ৎৱরযা তৱ সমীপমুপস্থায মদ্ৱক্তস্থখঙ্গেন তৈঃ সহ যোৎস্যামি|
17 ౧౭ మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.”
১৭যস্য শ্রোত্রং ৱিদ্যতে স সমিতীঃ প্রত্যুচ্যমানাম্ আত্মনঃ কথাং শৃণোতু| যো জনো জযতি তস্মা অহং গুপ্তমান্নাং ভোক্তুং দাস্যামি শুভ্রপ্রস্তরমপি তস্মৈ দাস্যামি তত্র প্রস্তরে নূতনং নাম লিখিতং তচ্চ গ্রহীতারং ৱিনা নান্যেন কেনাপ্যৱগম্যতে|
18 ౧౮ “తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ ఉన్న దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే,
১৮অপরং থুযাতীরাস্থসমিতে র্দূতং প্রতীদং লিখ| যস্য লোচনে ৱহ্নিশিখাসদৃশে চরণৌ চ সুপিত্তলসঙ্কাশৌ স ঈশ্ৱরপুত্রো ভাষতে,
19 ౧౯ నీ పనులూ నీ ప్రేమా నీ విశ్వాసమూ నీ సేవా నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.
১৯তৱ ক্রিযাঃ প্রেম ৱিশ্ৱাসঃ পরিচর্য্যা সহিষ্ণুতা চ মম গোচরাঃ, তৱ প্রথমক্রিযাভ্যঃ শেষক্রিযাঃ শ্রেষ্ঠাস্তদপি জানামি|
20 ౨౦ అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.
২০তথাপি তৱ ৱিরুদ্ধং মযা কিঞ্চিদ্ ৱক্তৱ্যং যতো যা ঈষেবল্নামিকা যোষিৎ স্ৱাং ভৱিষ্যদ্ৱাদিনীং মন্যতে ৱেশ্যাগমনায দেৱপ্রসাদাশনায চ মম দাসান্ শিক্ষযতি ভ্রামযতি চ সা ৎৱযা ন নিৱার্য্যতে|
21 ౨౧ పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు.
২১অহং মনঃপরিৱর্ত্তনায তস্যৈ সমযং দত্তৱান্ কিন্তু সা স্ৱীযৱেশ্যাক্রিযাতো মনঃপরিৱর্ত্তযিতুং নাভিলষতি|
22 ౨౨ ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.
২২পশ্যাহং তাং শয্যাযাং নিক্ষেপ্স্যামি, যে তযা সার্দ্ধং ৱ্যভিচারং কুর্ৱ্ৱন্তি তে যদি স্ৱক্রিযাভ্যো মনাংসি ন পরাৱর্ত্তযন্তি তর্হি তানপি মহাক্লেশে নিক্ষেপ্স্যামি
23 ౨౩ ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.
২৩তস্যাঃ সন্তানাংশ্চ মৃত্যুনা হনিষ্যামি| তেনাহম্ অন্তঃকরণানাং মনসাঞ্চানুসন্ধানকারী যুষ্মাকমেকৈকস্মৈ চ স্ৱক্রিযাণাং ফলং মযা দাতৱ্যমিতি সর্ৱ্ৱাঃ সমিতযো জ্ঞাস্যন্তি|
24 ౨౪ అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను.
২৪অপরম্ অৱশিষ্টান্ থুযাতীরস্থলোকান্ অর্থতো যাৱন্তস্তাং শিক্ষাং ন ধারযন্তি যে চ কৈশ্চিৎ শযতানস্য গম্ভীরার্থা উচ্যন্তে তান্ যে নাৱগতৱন্তস্তানহং ৱদামি যুষ্মাসু কমপ্যপরং ভারং নারোপযিষ্যামি;
25 ౨౫ నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి.
২৫কিন্তু যদ্ যুষ্মাকং ৱিদ্যতে তৎ মমাগমনং যাৱদ্ ধারযত|
26 ౨౬ జయిస్తూ, నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను.
২৬যো জনো জযতি শেষপর্য্যন্তং মম ক্রিযাঃ পালযতি চ তস্মা অহম্ অন্যজাতীযানাম্ আধিপত্যং দাস্যামি;
27 ౨౭ అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు.
২৭পিতৃতো মযা যদ্ৱৎ কর্তৃৎৱং লব্ধং তদ্ৱৎ সো ঽপি লৌহদণ্ডেন তান্ চারযিষ্যতি তেন মৃদ্ভাজনানীৱ তে চূর্ণা ভৱিষ্যন্তি|
28 ౨౮ తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను.
২৮অপরম্ অহং তস্মৈ প্রভাতীযতারাম্ অপি দাস্যামি|
29 ౨౯ మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”
২৯যস্য শ্রোত্রং ৱিদ্যতে স সমিতীঃ প্রত্যুচ্যমানাম্ আত্মনঃ কথাং শৃণোতু|

< ప్రకటన గ్రంథము 2 >