< ప్రకటన గ్రంథము 17 >

1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా.
তদনন্তরং তেষাং সপ্তকংসধারিণাং সপ্তদূতানাম্ এক আগত্য মাং সম্ভাষ্যাৱদৎ, অত্রাগচ্ছ, মেদিন্যা নরপতযো যযা ৱেশ্যযা সার্দ্ধং ৱ্যভিচারকর্ম্ম কৃতৱন্তঃ,
2 భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు.
যস্যা ৱ্যভিচারমদেন চ পৃথিৱীনিৱাসিনো মত্তা অভৱন্ তস্যা বহুতোযেষূপৱিষ্টাযা মহাৱেশ্যাযা দণ্ডম্ অহং ৎৱাং দর্শযামি|
3 అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.
ততো ঽহম্ আত্মনাৱিষ্টস্তেন দূতেন প্রান্তরং নীতস্তত্র নিন্দানামভিঃ পরিপূর্ণং সপ্তশিরোভি র্দশশৃঙ্গৈশ্চ ৱিশিষ্টং সিন্দূরৱর্ণং পশুমুপৱিষ্টা যোষিদেকা মযা দৃষ্টা|
4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి.
সা নারী কৃষ্ণলোহিতৱর্ণং সিন্দূরৱর্ণঞ্চ পরিচ্ছদং ধারযতি স্ৱর্ণমণিমুক্তাভিশ্চ ৱিভূষিতাস্তি তস্যাঃ করে ঘৃণার্হদ্রৱ্যৈঃ স্ৱৱ্যভিচারজাতমলৈশ্চ পরিপূর্ণ একঃ সুৱর্ণমযঃ কংসো ৱিদ্যতে|
5 ఆమె నుదుటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. “ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటికీ ఇది తల్లి.”
তস্যা ভালে নিগূঢৱাক্যমিদং পৃথিৱীস্থৱেশ্যানাং ঘৃণ্যক্রিযাণাঞ্চ মাতা মহাবাবিলিতি নাম লিখিতম্ আস্তে|
6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను.
মম দৃষ্টিগোচরস্থা সা নারী পৱিত্রলোকানাং রুধিরেণ যীশোঃ সাক্ষিণাং রুধিরেণ চ মত্তাসীৎ তস্যা দর্শনাৎ মমাতিশযম্ আশ্চর্য্যজ্ঞানং জাতং|
7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
ততঃ স দূতো মাম্ অৱদৎ কুতস্তৱাশ্চর্য্যজ্ঞানং জাযতে? অস্যা যোষিতস্তদ্ৱাহনস্য সপ্তশিরোভি র্দশশৃঙ্গৈশ্চ যুক্তস্য পশোশ্চ নিগূঢভাৱম্ অহং ৎৱাং জ্ঞাপযামি|
8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరవాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు. (Abyssos g12)
ৎৱযা দৃষ্টো ঽসৌ পশুরাসীৎ নেদানীং ৱর্ত্ততে কিন্তু রসাতলাৎ তেনোদেতৱ্যং ৱিনাশশ্চ গন্তৱ্যঃ| ততো যেষাং নামানি জগতঃ সৃষ্টিকালম্ আরভ্য জীৱনপুস্তকে লিখিতানি ন ৱিদ্যন্তে তে পৃথিৱীনিৱাসিনো ভূতম্ অৱর্ত্তমানমুপস্থাস্যন্তঞ্চ তং পশুং দৃষ্ট্ৱাশ্চর্য্যং মংস্যন্তে| (Abyssos g12)
9 దీనికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ మృగానికున్న ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు. ఇంకా వారు ఏడుగురు రాజులు.
অত্র জ্ঞানযুক্তযা বুদ্ধ্যা প্রকাশিতৱ্যং| তানি সপ্তশিরাংসি তস্যা যোষিত উপৱেশনস্থানস্ৱরূপাঃ সপ্তগিরযঃ সপ্ত রাজানশ্চ সন্তি|
10 ౧౦ వారిలో ఐదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంత కాలం ఉండాలి.
১০তেষাং পঞ্চ পতিতা একশ্চ ৱর্ত্তমানঃ শেষশ্চাদ্যাপ্যনুপস্থিতঃ স যদোপস্থাস্যতি তদাপি তেনাল্পকালং স্থাতৱ্যং|
11 ౧౧ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
১১যঃ পশুরাসীৎ কিন্ত্ৱিদানীং ন ৱর্ত্ততে স এৱাষ্টমঃ, স সপ্তানাম্ একো ঽস্তি ৱিনাশং গমিষ্যতি চ|
12 ౧౨ నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంతకు ముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు.
১২ৎৱযা দৃষ্টানি দশশৃঙ্গাণ্যপি দশ রাজানঃ সন্তিঃ, অদ্যাপি তৈ রাজ্যং ন প্রাপ্তং কিন্তু মুহূর্ত্তমেকং যাৱৎ পশুনা সার্দ্ধং তে রাজান ইৱ প্রভুৎৱং প্রাপ্স্যন্তি|
13 ౧౩ వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
১৩ত একমন্ত্রণা ভৱিষ্যন্তি স্ৱকীযশক্তিপ্রভাৱৌ পশৱে দাস্যন্তি চ|
14 ౧౪ వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”
১৪তে মেষশাৱকেন সার্দ্ধং যোৎস্যন্তি, কিন্তু মেষশাৱকস্তান্ জেষ্যতি যতঃ স প্রভূনাং প্রভূ রাজ্ঞাং রাজা চাস্তি তস্য সঙ্গিনো ঽপ্যাহূতা অভিরুচিতা ৱিশ্ৱাস্যাশ্চ|
15 ౧౫ ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, “ఆ వేశ్య కూర్చున్నచోట నువ్వు చూసిన జలాలు ప్రజలనూ, జన సమూహాలనూ, జాతులనూ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి.
১৫অপরং স মাম্ অৱদৎ সা ৱেশ্যা যত্রোপৱিশতি তানি তোযানি লোকা জনতা জাতযো নানাভাষাৱাদিনশ্চ সন্তি|
16 ౧౬ నువ్వు చూసిన పది కొమ్ములు-వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కాల్చివేస్తారు.
১৬ৎৱযা দৃষ্টানি দশ শৃঙ্গাণি পশুশ্চেমে তাং ৱেশ্যাম্ ঋতীযিষ্যন্তে দীনাং নগ্নাঞ্চ করিষ্যন্তি তস্যা মাংসানি ভোক্ষ্যন্তে ৱহ্নিনা তাং দাহযিষ্যন্তি চ|
17 ౧౭ దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు.
১৭যত ঈশ্ৱরস্য ৱাক্যানি যাৱৎ সিদ্ধিং ন গমিষ্যন্তি তাৱদ্ ঈশ্ৱরস্য মনোগতং সাধযিতুম্ একাং মন্ত্রণাং কৃৎৱা তস্মৈ পশৱে স্ৱেষাং রাজ্যং দাতুঞ্চ তেষাং মনাংসীশ্ৱরেণ প্রৱর্ত্তিতানি|
18 ౧౮ ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహా నగరమే.
১৮অপরং ৎৱযা দৃষ্টা যোষিৎ সা মহানগরী যা পৃথিৱ্যা রাজ্ঞাম্ উপরি রাজৎৱং কুরুতে|

< ప్రకటన గ్రంథము 17 >