< ప్రకటన గ్రంథము 10 >
1 ౧ మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్ర ధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
Then I saw another mighty angel, descending from heaven. His robe was a cloud; over his head was the rainbow; his face was like the sun, and his feet like pillars of fire;
2 ౨ ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రంపైనా ఎడమకాలు భూమిపైనా ఉంచాడు.
in his hand he held a little book open. He set his right foot on the sea, and his left on the land;
3 ౩ తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.
and he cried in a loud voice like the roaring of a lion. At his cry the seven peals of thunder spoke, each with its own voice.
4 ౪ ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి “ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు” అంటూ నాకొక స్వరం వినిపించింది.
And, when they spoke, I was about to write; but I heard a voice from heaven say – ‘Keep secret what the seven peals of thunder said, and do not write it down.’
5 ౫ అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.
Then the angel, whom I had seen standing on the sea and on the land, raised his right hand to the heavens,
6 ౬ పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు. (aiōn )
and swore by him who lives for ever and ever, who created the heavens and all that is in them, and the earth and all that is in it, and the sea and all that is in it, that time should cease to be. (aiōn )
7 ౭ ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”
Moreover at the time when the seventh angel will speak, when he is ready to blow his blast, then the hidden purposes of God, of which he told the good news to his servants, the prophets, are at once fulfilled.
8 ౮ అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్లీ, “సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో” అని నాకు చెప్పాడు.
Then came the voice which I had heard from heaven. It spoke to me again, and said – ‘Go and take the book that is open in the hand of the angel who stands on the sea and on the land.’
9 ౯ నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, “ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది” అన్నాడు.
So I went to the angel and asked him to give me the little book. And he said ‘Take it, and eat it. It will be bitter to your stomach, but in your mouth it will be as sweet as honey.’
10 ౧౦ అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది.
I took the little book out of the angel’s hand and ate it, and, while in my mouth, it was like the sweetest honey; but, when I had eaten it, it was bitter to my stomach.
11 ౧౧ అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”
And I was told – ‘You must prophesy again about men of many peoples, and nations, and languages, and about many kings.’