< కీర్తనల~ గ్రంథము 99 >
1 ౧ యెహోవా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా కూర్చుని ఉన్నాడు. భూమి కంపిస్తుంది.
耶和华作王;万民当战抖! 他坐在二基路伯上,地当动摇。
2 ౨ సీయోనులో యెహోవా గొప్పవాడు. రాజ్యాలన్నిటి పైగా ఆయన ఉన్నతంగా ఉన్నాడు.
耶和华在锡安为大; 他超乎万民之上。
3 ౩ వాళ్ళు నీ ఘన నామాన్ని స్తుతిస్తారు. యెహోవా పవిత్రుడు.
他们当称赞他大而可畏的名; 他本为圣!
4 ౪ రాజు బలశాలి. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు నీతి న్యాయాలను సుస్థిరం చేశావు, యాకోబు ప్రజల పట్ల నీతి పాలన స్థాపించావు.
王有能力,喜爱公平,坚立公正, 在雅各中施行公平和公义。
5 ౫ మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు.
你们当尊崇耶和华—我们的 神, 在他脚凳前下拜。 他本为圣!
6 ౬ ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు.
在他的祭司中有摩西和亚伦; 在求告他名的人中有撒母耳。 他们求告耶和华,他就应允他们。
7 ౭ మేఘస్తంభంలో నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయన శాసనాలను పాటించారు. ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించారు.
他在云柱中对他们说话; 他们遵守他的法度和他所赐给他们的律例。
8 ౮ యెహోవా మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు. వాళ్ళ అక్రమ కార్యాలకు వాళ్ళను శిక్షించినా, నువ్వు వాళ్ళను క్షమించిన దేవుడివి.
耶和华—我们的 神啊,你应允他们; 你是赦免他们的 神, 却按他们所行的报应他们。
9 ౯ మన యెహోవా దేవుడు పవిత్రుడు, మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతం ఎదుట ఆరాధించండి.
你们要尊崇耶和华—我们的 神, 在他的圣山下拜, 因为耶和华—我们的 神本为圣!