< కీర్తనల~ గ్రంథము 98 >

1 ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి.
Псалом. Співайте Господеві нову пісню, бо Він здійснив чудеса; перемогу принесла Йому правиця Його і рамено Його святе.
2 యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు.
Звістив Господь спасіння Своє, відкрив перед очима народів праведність Свою.
3 ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు.
Згадав Він милість Свою й вірність Свою дому Ізраїля. Усі краї землі побачили спасіння Бога нашого.
4 లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.
Вигукни радісно Господеві, уся земле! Кричи від радості, веселися й співай!
5 తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.
Грайте Господеві на арфі, на арфі зі звуками співу!
6 బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.
Під звуки труб і сурми вигукуйте радісно перед Царем, Господом!
7 సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!
Нехай гуркотить море і все, що його наповнює, всесвіт і все, що мешкає в ньому.
8 నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి.
Нехай ріки плещуть у долоні, нехай гори веселяться разом
9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.
перед обличчям Господа, бо Він іде судити землю. Він судитиме всесвіт праведно й народи – справедливо.

< కీర్తనల~ గ్రంథము 98 >