< కీర్తనల~ గ్రంథము 97 >
1 ౧ యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక.
Gospod kraljuje, radúj se zemlja, veselé se naj pokrajine premnoge.
2 ౨ మబ్బులూ చీకటీ ఆయనచుట్టూ ఉన్నాయి. నీతి న్యాయాలు యెహోవా సింహాసనానికి పునాదిగా ఉన్నాయి.
Oblaki in temà ga obdajajo; pravica in sodba kraj njegovega prestola.
3 ౩ ఆయన ముందు అగ్ని బయలు దేరింది. చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది.
Ogenj hodi pred njim in požiga okrog sovražnike njegove.
4 ౪ ఆయన మెరుపులు లోకాన్ని వెలిగిస్తాయి. భూమి దాన్ని చూసి వణికిపోతుంది.
Bliski razsvetljujejo vesoljni svet njegov, vidi in trese se zemlja.
5 ౫ లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.
Goré se topé kakor vosek vpričo Gospoda, vpričo vse zemlje gospodarja.
6 ౬ ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి రాజ్యాలన్నీ ఆయన మహాత్మ్యాన్ని చూస్తాయి.
Nebesa oznanjajo pravico njegovo; tako da vidijo vsa ljudstva čast njegovo.
7 ౭ చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్ళు, పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. అలాటి దేవుళ్ళు అందరూ యెహోవాకు మొక్కండి.
Osramoté se naj vsi, ki se ponašajo z maliki; klanjajo naj se mu vsi angeli.
8 ౮ యెహోవా, సీయోను ఇది విని సంతోషించింది. యూదా పట్టణాలు ఆనందించాయి. నీ నీతికరమైన ఆదేశాలనుబట్టి సంతోషిస్తున్నాయి.
Čuje in veseli se naj Sijon, in radujejo se hčere Judovske, zavoljo sodeb tvojih, Gospod.
9 ౯ ఎందుకంటే యెహోవా, నువ్వు ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి. దేవుళ్ళందరిలోకీ నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు.
Ti namreč si Gospod, vzvišen nad vso zemljo; silno povišan si nad vse angele.
10 ౧౦ యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.
Kateri ljubite Gospoda, sovražite húdo; duše svojih, katerim izkazuje milost, hrani, iz rok krivičnih jih otima.
11 ౧౧ నీతిమంతులకు వెలుగును, నిజాయితీపరులకు ఆనందాన్ని విత్తనాలుగా చల్లడం జరిగింది.
Luč se je rodila pravičnemu, in poštenim v srci radost.
12 ౧౨ నీతిమంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి.
Veselite se, pravični v Gospodu, in slavite spomin svetosti njegove.