< కీర్తనల~ గ్రంథము 96 >

1 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.
Yeni bir ezgi söyleyin RAB'be! Ey bütün dünya, RAB'be ezgiler söyleyin!
2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.
Ezgi söyleyin, RAB'bin adını övün, Her gün duyurun kurtarışını!
3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.
Görkemini uluslara, Harikalarını bütün halklara anlatın!
4 యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.
Çünkü RAB uludur, yalnız O övgüye değer, İlahlardan çok O'ndan korkulur.
5 జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.
Halkların bütün ilahları bir hiçtir, Oysa gökleri yaratan RAB'dir.
6 ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి.
Yücelik, ululuk O'nun huzurundadır, Güç ve güzellik O'nun tapınağındadır.
7 ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి.
Ey bütün halklar, RAB'bi övün, RAB'bin gücünü, yüceliğini övün,
8 యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి.
RAB'bin görkemini adına yaraşır biçimde övün, Sunular getirip avlularına girin!
9 పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.
Kutsal giysiler içinde RAB'be tapının! Titreyin O'nun önünde, ey bütün yeryüzündekiler!
10 ౧౦ యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి.
Uluslara, “RAB egemenlik sürüyor” deyin. Dünya sağlam kurulmuş, sarsılmaz. O halkları adaletle yargılar.
11 ౧౧ యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.
Sevinsin gökler, coşsun yeryüzü! Gürlesin deniz içindekilerle birlikte!
12 ౧౨ మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక
Bayram etsin kırlar ve üzerindekiler! O zaman RAB'bin önünde bütün orman ağaçları Sevinçle haykıracak. Çünkü O geliyor! Yeryüzünü yargılamaya geliyor. Dünyayı adaletle, Halkları kendi gerçeğiyle yönetecek.
13 ౧౩ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

< కీర్తనల~ గ్రంథము 96 >