< కీర్తనల~ గ్రంథము 96 >
1 ౧ యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.
Pjevajte Jahvi pjesmu novu! Pjevaj Jahvi, sva zemljo!
2 ౨ యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.
Pjevajte Jahvi, hvalite ime njegovo! Navješćujte iz dana u dan spasenje njegovo,
3 ౩ రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.
kazujte poganima njegovu slavu, svim narodima čudesa njegova.
4 ౪ యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.
Velik je Jahve, hvale predostojan, strašniji od svih bogova!
5 ౫ జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.
Ništavni su svi bozi naroda. Jahve stvori nebesa!
6 ౬ ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి.
Slava je i veličanstvo pred njim, (sila) i sjaj u Svetištu njegovu.
7 ౭ ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి.
Dajte Jahvi, narodna plemena, dajte Jahvi slavu i silu!
8 ౮ యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి.
Dajte Jahvi slavu imena njegova! Prinosite žrtvu i uđite u dvorove njegove,
9 ౯ పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.
poklonite se Jahvi u sjaju svetosti njegove. Strepi pred njim, zemljo sva!
10 ౧౦ యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి.
Nek' se govori među poganima: “Jahve kraljuje!” Svijet on učvrsti da se ne pomakne, narodima pravedno upravlja.
11 ౧౧ యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.
Raduj se, nebo, i kliči, zemljo! Neka huči more i što je u njemu!
12 ౧౨ మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక
Nek' se raduje polje i što je na njemu, neka klikće šumsko drveće
13 ౧౩ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
pred Jahvom, jer dolazi, jer dolazi suditi zemlji. Sudit će svijetu u pravdi i narodima u istini svojoj.