< కీర్తనల~ గ్రంథము 95 >
1 ౧ రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
Jertek, ujjongjunk az Örökkévalónak, riadjunk üdvünk sziklájának.
2 ౨ కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
Járuljunk szine elé hálaszóval, dalokkal riadjunk neki!
3 ౩ యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
Mert nagy Isten az Örökkévaló s nagy király mind az istenek fölött;
4 ౪ భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.
kinek kezében vannak a föld mélységei, s övéi a hegyek magasságai;
5 ౫ సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.
kié a tenger, s ő készítette, s a szárazföldet kezei alkották.
6 ౬ రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
Jőjjetek, boruljunk le s hajoljunk meg, térdeljünk az Örökkévaló, a mi teremtőnk előtt.
7 ౭ ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!
Mert Ő a mi Istenünk, s mi legelésének népe és kezének juhai – e napon vajha hallgatnátok szavára.
8 ౮ మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.
Ne keményítsétek meg szíveteket mint Meribánál, mint Massza napján a pusztában,
9 ౯ అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.
a hol megkisértettek engem őseitek, próbára tettek, bár látták cselekvésemet.
10 ౧౦ నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు తెలుసుకోలేదు అన్నాను.
Negyven évig undorodtam a nemzedéktől s mondtam: tévelygő szívűek népe ők, s ők nem ismerik utjaimat;
11 ౧౧ కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.
úgy hogy megesküdtem haragomban: nem fognak bemenni nyugvó helyembe!