< కీర్తనల~ గ్రంథము 94 >

1 ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
あだを報いられる神、主よ、あだを報いられる神よ、光を放ってください。
2 లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
地をさばかれる者よ、立って高ぶる者にその受くべき罰をお与えください。
3 యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
主よ、悪しき者はいつまで、悪しき者はいつまで勝ち誇るでしょうか。
4 వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
彼らは高慢な言葉を吐き散らし、すべて不義を行う者はみずから高ぶります。
5 యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
主よ、彼らはあなたの民を打ち砕き、あなたの嗣業を苦しめます。
6 వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
彼らはやもめと旅びとのいのちをうばい、みなしごを殺します。
7 వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
彼らは言います、「主は見ない、ヤコブの神は悟らない」と。
8 బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
民のうちの鈍き者よ、悟れ。愚かな者よ、いつ賢くなるだろうか。
9 చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
耳を植えた者は聞くことをしないだろうか、目を造った者は見ることをしないだろうか。
10 ౧౦ రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
もろもろの国民を懲らす者は罰することをしないだろうか、人を教える者は知識をもたないだろうか。
11 ౧౧ మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
主は人の思いの、むなしいことを知られる。
12 ౧౨ యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
主よ、あなたによって懲らされる人、あなたのおきてを教えられる人はさいわいです。
13 ౧౩ దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
あなたはその人を災の日からのがれさせ、悪しき者のために穴が掘られるまでその人に平安を与えられます。
14 ౧౪ యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
主はその民を捨てず、その嗣業を見捨てられないからです。
15 ౧౫ న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
さばきは正義に帰り、すべて心の正しい者はそれに従うでしょう。
16 ౧౬ దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
だれがわたしのために立ちあがって、悪しき者を責めるだろうか。だれがわたしのために立って、不義を行う者を責めるだろうか。
17 ౧౭ యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
もしも主がわたしを助けられなかったならば、わが魂はとくに音なき所に住んだであろう。
18 ౧౮ నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
しかし「わたしの足がすべる」と思ったとき、主よ、あなたのいつくしみはわたしをささえられました。
19 ౧౯ నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
わたしのうちに思い煩いの満ちるとき、あなたの慰めはわが魂を喜ばせます。
20 ౨౦ దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
定めをもって危害をたくらむ悪しき支配者はあなたと親しむことができるでしょうか。
21 ౨౧ వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
彼らは相結んで正しい人の魂を責め、罪のない者に死を宣告します。
22 ౨౨ అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
しかし主はわが高きやぐらとなり、わが神はわが避け所の岩となられました。
23 ౨౩ ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.
主は彼らの不義を彼らに報い、彼らをその悪のゆえに滅ぼされます。われらの神、主は彼らを滅ぼされます。

< కీర్తనల~ గ్రంథము 94 >