< కీర్తనల~ గ్రంథము 93 >
1 ౧ యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.
Laus Cantici ipsi David, in die ante Sabbatum, quando fundata est terra.
2 ౨ ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.
Dominus regnavit, decorem indutus est:
3 ౩ యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.
indutus est Dominus fortitudinem, et præcinxit se. Etenim firmavit orbem terræ, qui non commovebitur.
4 ౪ అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి.
Parata sedes tua ex tunc: a sæculo tu es.
5 ౫ యెహోవా, నీ శాసనాలు నమ్మదగినవి, పరిశుద్ధత నీ ఇంటికి శాశ్వత అలంకారంగా ఉంది.
Testimonia tua credibilia facta sunt nimis: domum tuam decet sanctitudo Domine in longitudinem dierum.