< కీర్తనల~ గ్రంథము 92 >
1 ౧ విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన. యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
Psalam. Pjesma. Za dan subotnji. Dobro je slaviti Jahvu, pjevati imenu tvome, Svevišnji;
2 ౨ ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.
naviještati jutrom ljubav tvoju i noću vjernost tvoju,
3 ౩ పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.
uz harfu od deset žica i liru, s pjesmom uz citaru.
4 ౪ ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.
Obradovao si me djelima svojim, o Jahve, kličem zbog djela ruku tvojih.
5 ౫ యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.
Kako su silna djela tvoja, o Jahve, i duboki naumi tvoji!
6 ౬ పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.
Bezuman čovjek ne spoznaje, luđak ne shvaća.
7 ౭ దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!
Sve ako bi bezbošci nicali k'o trava i cvali svi što zlo čine, određeni su za vječnu propast;
8 ౮ అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.
a ti, Jahve, dovijeka uzvišen ostaješ.
9 ౯ యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.
Doista, dušmani tvoji, o Jahve, tvoji će dušmani propasti; raspršit će se svi što čine zlo.
10 ౧౦ అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.
Rog si mi digao k'o u bivola, pomazao me uljem prečistim;
11 ౧౧ నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.
i oko mi s visoka gleda dušmane i uho mirno sluša o onima što na me ustaju.
12 ౧౨ నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.
K'o palma cvate pravednik i raste k'o cedar libanonski.
13 ౧౩ వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.
Zasađeni u Domu Jahvinu, cvatu u dvorima Boga našega.
14 ౧౪ యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.
Rod donose i u starosti, sočni i puni svježine:
15 ౧౫ ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.
da navijeste kako je pravedan Jahve, Hrid moja, onaj na kome nema nepravde.