< కీర్తనల~ గ్రంథము 90 >
1 ౧ దేవుని మనిషి మోషే ప్రార్థన. ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
Àdúrà Mose ènìyàn Ọlọ́run. Olúwa, ìwọ ti jẹ́ ibùgbé wa ní gbogbo ìran dé ìran.
2 ౨ పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
Kí a tó bí àwọn òkè ńlá àti kí ìwọ tó dá ilẹ̀ àti ayé, láti ayérayé dé ayérayé ìwọ ni Ọlọ́run.
3 ౩ నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.
Ìwọ yí ènìyàn padà sí erùpẹ̀, wí pé, “Padà sí erùpẹ̀, ìwọ ọmọ ènìyàn.”
4 ౪ నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
Nítorí pé ìgbà tí ẹgbẹ̀rún ọdún bá kọjá lójú rẹ, bí àná ni ó rí, bí ìgbà ìṣọ́ kan lóru.
5 ౫ వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.
Ìwọ gbá ènìyàn dànù nínú oorun ikú; wọ́n dàbí koríko tuntun ní òwúrọ̀.
6 ౬ ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.
Lóòtítọ́, ní òwúrọ̀, ó yọ tuntun ní àṣálẹ́ ni yóò gbẹ, tí yóò sì rẹ̀ dànù.
7 ౭ నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.
A pa wá run nípa ìbínú rẹ nípa ìbínú rẹ ara kò rọ̀ wá.
8 ౮ మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.
Ìwọ ti gbé ẹ̀ṣẹ̀ wa ka iwájú rẹ, àti ohun ìkọ̀kọ̀ wa nínú ìmọ́lẹ̀ iwájú rẹ.
9 ౯ నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.
Gbogbo ọjọ́ wa ń kọjá lọ lábẹ́ ìbínú rẹ; àwa ń lo ọjọ́ wa lọ bí àlá tí à ń rọ́.
10 ౧౦ మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.
Àádọ́rin ọdún ni iye ọjọ́ ọdún wá, bi ó sì ṣe pé nípa agbára tí wọn bá tó ọgọ́rin ọdún, agbára nínú làálàá pẹ̀lú ìbànújẹ́ ni, nítorí pé a kò ní pẹ́ gé e kúrò, àwa a sì fò lọ.
11 ౧౧ నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?
Ta ni ó mọ agbára ìbínú rẹ? Gẹ́gẹ́ bí ẹ̀rù rẹ, bẹ́ẹ̀ ni ìbínú rẹ.
12 ౧౨ కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
Kọ́ wa bí a ti ń kaye ọjọ́ wa dáradára, kí àwa ba à lè fi ọkàn wa sípa ọgbọ́n.
13 ౧౩ యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.
Yípadà, Olúwa! Yóò ti pẹ́ tó? Ṣàánú fún àwọn ọmọ ọ̀dọ̀ rẹ.
14 ౧౪ ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.
Tẹ́ wa lọ́rùn ní òwúrọ̀ nínú ìṣeun ìfẹ́ rẹ, kí àwa kí ó lè kọrin fún ayọ̀ kí inú wa sì dùn ní gbogbo ọjọ́.
15 ౧౫ నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.
Mú inú wa dùn bí ọjọ́ tí ìwọ ti pọ́n wa lójú, fún ọjọ́ púpọ̀ tí àwa ti rí wàhálà.
16 ౧౬ నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
Jẹ́ kí a fi iṣẹ́ rẹ̀ han àwọn ọmọ ọ̀dọ̀ rẹ̀, ògo rẹ̀ sí àwọn ọmọ wọn.
17 ౧౭ మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
Jẹ́ kí ẹwà Olúwa Ọlọ́run wa wà lára wa; fi ìdí iṣẹ́ ọwọ́ wa múlẹ̀ lára wa, bẹ́ẹ̀ ni, kí ó sì fi ìdí iṣẹ́ ọwọ́ wa múlẹ̀.