< కీర్తనల~ గ్రంథము 90 >

1 దేవుని మనిషి మోషే ప్రార్థన. ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
دعای موسی مرد خدا ای خداوند مسکن ما تو بوده‌ای، درجمیع نسل‌ها،۱
2 పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
قبل از آنکه کوهها به وجود آید و زمین ربع مسکون را بیافرینی. از ازل تا به ابد تو خدا هستی.۲
3 నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.
انسان را به غباربرمی گردانی، و می‌گویی‌ای بنی آدم رجوع نمایید.۳
4 నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
زیرا که هزار سال در نظر تو مثل دیروزاست که گذشته باشد و مثل پاسی از شب.۴
5 వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.
مثل سیلاب ایشان را رفته‌ای و مثل خواب شده‌اند. بامدادان مثل گیاهی که می‌روید.۵
6 ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.
بامدادان می‌شکفد و می‌روید. شامگاهان بریده و پژمرده می‌شود.۶
7 నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.
زیرا که در غضب تو کاهیده می‌شویم ودر خشم تو پریشان می‌گردیم.۷
8 మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.
چونکه گناهان مارا در نظر خود گذارده‌ای و خفایای ما را در نورروی خویش.۸
9 నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.
زیرا که تمام روزهای ما در خشم تو سپری شد و سالهای خود را مثل خیالی بسر برده‌ایم.۹
10 ౧౦ మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.
ایام عمر ما هفتاد سال است و اگر ازبنیه، هشتاد سال باشد. لیکن فخر آنها محنت وبطالت است زیرا به زودی تمام شده، پروازمی کنیم.۱۰
11 ౧౧ నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?
کیست که شدت خشم تو را می‌داند وغضب تو را چنانکه از تو می‌باید ترسید.۱۱
12 ౧౨ కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
ما را تعلیم ده تا ایام خود را بشماریم تا دل خردمندی را حاصل نماییم.۱۲
13 ౧౩ యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.
رجوع کن‌ای خداوند تا به کی و بر بندگان خود شفقت فرما.۱۳
14 ౧౪ ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.
صبحگاهان ما را از رحمت خود سیر کن تاتمامی عمر خود ترنم و شادی نماییم.۱۴
15 ౧౫ నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.
ما راشادمان گردان به عوض ایامی که ما را مبتلاساختی و سالهایی که بدی را دیده‌ایم.۱۵
16 ౧౬ నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
اعمال تو بر بندگانت ظاهر بشود و کبریایی تو بر فرزندان ایشان.۱۶
17 ౧౭ మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
جمال خداوند خدای ما بر ما باد وعمل دستهای ما را بر ما استوار ساز. عمل دستهای ما را استوار گردان.۱۷

< కీర్తనల~ గ్రంథము 90 >