< కీర్తనల~ గ్రంథము 9 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం. హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.
(Til sangmesteren. Al-mut-labben. En Salme af David.) Jeg vil takke HERREN af hele mit Hjerte, kundgøre alle dine Undere,
2 ౨ మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
glæde og fryde mig i dig, lovsynge dit Navn, du Højeste,
3 ౩ నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు.
fordi mine Fjender veg, faldt og forgik for dit Åsyn.
4 ౪ ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు.
Thi du hævded min Ret og min Sag, du sad på Tronen som Retfærds Dommer.
5 ౫ నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు.
Du trued ad Folkene, rydded de gudløse ud, deres Navn har du slettet for evigt.
6 ౬ తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.
Fjenden er borte, lagt øde for stedse, du omstyrted Byer, de mindes ej mer.
7 ౭ కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు.
Men HERREN troner evindelig, han rejste sin Trone til Dom,
8 ౮ యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు.
skal dømme Verden med Retfærd, fælde Dom over Folkefærd med Ret.
9 ౯ పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.
HERREN blev de fortryktes Tilflugt, en Tilflugt i Trængselstider;
10 ౧౦ యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.
og de stoler på dig, de, som kender dit Navn, thi du svigted ej dem, der søgte dig, HERRE.
11 ౧౧ సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి.
Lovsyng HERREN, der bor på Zion, kundgør blandt Folkene, hvad han har gjort!
12 ౧౨ ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు.
Thi han, der hævner Blodskyld, kom dem i Hu, han glemte ikke de armes Råb:
13 ౧౩ యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే.
"HERRE, vær nådig, se, hvad jeg lider af Avindsmænd, du, som løfter mig op fra Dødens Porte,
14 ౧౪ నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను!
at jeg kan kundgøre al din Pris, juble over din Frelse i Zions Datters Porte!"
15 ౧౫ జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి.
Folkene sank i Graven, de grov, deres Fod blev hildet i Garnet, de satte.
16 ౧౬ యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. (సెలా)
HERREN blev åbenbar, holdt Dom, den gudløse hildedes i sine Hænders Gerning. - Higgajon (Sela)
17 ౧౭ దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. (Sheol )
Til Dødsriget skal de gudløse fare, alle Folk, der ej kommer Gud i Hu. (Sheol )
18 ౧౮ అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.
Thi den fattige glemmes ikke for evigt, ej skuffes evindelig ydmyges Håb.
19 ౧౯ యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక.
Rejs dig, HERRE, lad ikke Mennesker få Magten, lad Folkene dømmes for dit Åsyn;
20 ౨౦ యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. (సెలా)
HERRE, slå dem med Rædsel, lad Folkene kende, at de er Mennesker! (Sela)