< కీర్తనల~ గ్రంథము 88 >
1 ౧ ఒక పాట, కోరహు వారసుల కీర్తన. ప్రధాన సంగీతకారుని కోసం, మహలతు లయన్నోతు అనే రాగంతో పాడేది. ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ (దైవ ధ్యానం) యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.
A Song, a Melody. For the Sons of Korah. To the Chief Musician. On "Mahalath." For alternate Song. An Instructive Psalm. By Heman the Ezrahite. O Yahweh, God of my salvation, By day, have I made outcry, In the night, [also] before thee.
2 ౨ నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.
Let my prayer, come into thy presence, Bow down thine ear to my loud cry.
3 ౩ నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది. (Sheol )
For my soul, is sated with misfortunes, And, my life—unto Hades, hath drawn near; (Sheol )
4 ౪ సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
I am counted with them who descend into the pit, I have become as a man that is without help;
5 ౫ చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
Among the dead, is my couch, —Like the slain that lie in the grave, Where thou rememberest them no more, Yea, they, from thy hand, are cut off;
6 ౬ నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
Thou hast laid me, In the lowest pit, In dark places, In the deeps:
7 ౭ నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. (సెలా)
Upon me, hath rested thine indignation, And, with all thy breakers, hast thou caused affliction. (Selah)
8 ౮ నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
Thou hast far removed mine acquaintances from me, —Thou hast made me an abomination unto them, Shut up, and I cannot go forth!
9 ౯ బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
Mine eye, hath dimmed through affliction; I have called upon thee, O Yahweh, all day long, I have spread out, unto thee, my hands.
10 ౧౦ మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? (సెలా)
For the dead, wilt thou perform a wonder? Or shall, the shades, arising, give thee thanks? (Selah)
11 ౧౧ సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
Shall Thy lovingkindness be recounted in the grave? Thy faithfulness, in destruction?
12 ౧౨ చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
Shall any wonder of thine, be known in the dark? Or, thy righteousness, in the land of forgetfulness?
13 ౧౩ అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
But, I, unto thee, O Yahweh, have cried for help, And, in the morning, my prayer will confront thee!
14 ౧౪ యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
Wherefore, O Yahweh, shouldst thou reject my soul? shouldst thou hide thy face from me?
15 ౧౫ చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
Afflicted have I been, and dying, from youth, I have borne the terror of thee—I shall be distracted!
16 ౧౬ నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.
Over me, have passed thy bursts of burning anger, The alarms of thee have put an end to me;
17 ౧౭ నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి.
They have surrounded me like waters, all the day, They have come circling against me together:
18 ౧౮ నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.
Thou hast far removed from me, lover and friend, Mine acquaintances, are in darkness.