< కీర్తనల~ గ్రంథము 87 >
1 ౧ కోరహు వారసుల కీర్తన. ఒక పాట. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
Psaume et cantique des fils de Koré. Les fondements de Sion sont sur les montagnes saintes.
2 ౨ యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
Le Seigneur aime ses portes plus que toutes les tentes de Jacob.
3 ౩ దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. (సెలా)
On a dit de toi des choses glorieuses, ô cité de Dieu!
4 ౪ రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
Je rappellerai Raab et Babylone à ceux qui me connaissent. Et voilà que les étrangers et Tyr, et le peuple des Éthiopiens s'y sont réunis.
5 ౫ సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
Un homme dira: Ma mère est Sion; et cet homme y est né, et le Très-Haut lui-même en a été le fondateur.
6 ౬ యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. (సెలా)
Le Seigneur racontera cela dans l'écrit des peuples et des princes qui sont nés dans Sion.
7 ౭ గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు.
Pour tous, habiter en toi, c'est habiter dans la joie.