< కీర్తనల~ గ్రంథము 87 >

1 కోరహు వారసుల కీర్తన. ఒక పాట. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
詠【萬民的母親熙雍】 科辣黑子孫的詩歌。 上主喜愛自己的宮殿,是建在一切的聖山。
2 యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
祂喜愛所有的城門,勝過雅各伯所有的帳棚。
3 దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. (సెలా)
天主的聖城!人們論到您,曾經說了許多光榮的事; (休止)
4 రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
我要將辣哈布和巴比倫,列於認識我者的人群中:連培勒舍特、提洛和雇民,這些人都是在您那裏出生。
5 సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
論到熙雍,人要稱她為母親,人人都是在她那裏出生;至高者要親自使她堅。
6 యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. (సెలా)
上主要在萬民戶籍上留名:這些人也都是在那裏出生。 (休止)
7 గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు.
人們要在舞蹈時唱歌說:我的一切泉榞都在您內。

< కీర్తనల~ గ్రంథము 87 >