< కీర్తనల~ గ్రంథము 86 >

1 దావీదు ప్రార్థన. యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.
Oração de Davi: Inclina teus ouvidos, SENHOR, e ouve-me, porque estou aflito e necessitado.
2 నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.
Guarda minha alma, porque eu sou dedicado [a ti]; ó Deus, salva o teu servo, que confia em ti.
3 ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.
Tem misericórdia de mim, SENHOR, porque clamo a ti o dia todo.
4 ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.
Alegra a alma de teu servo; porque a ti, Senhor, levanto a minha alma.
5 ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
Pois tu, Senhor, és bom, perdoador, e grande em bondade para todos os que clamam a ti.
6 యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.
Inclina, SENHOR, teus ouvidos à minha oração; e presta atenção à voz de minhas súplicas.
7 నా కష్టాల్లో నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు జవాబిస్తావు.
No dia de minha angústia clamarei a ti, pois tu me responderás.
8 ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.
Não há semelhante a ti entre os deuses, ó Senhor; e nem obras como as tuas.
9 ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.
Todas as nações que tu fizeste virão e se prostrarão diante de ti, Senhor; e elas glorificarão o teu nome.
10 ౧౦ నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.
Pois tu és grande, e fazes maravilhas; somente tu és Deus.
11 ౧౧ యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.
Ensina-me, SENHOR, o teu caminho, [e] eu andarei em tua verdade; une meu coração com o temor ao teu nome.
12 ౧౨ ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.
Louvarei a ti, ó Senhor meu Deus, com todo o meu coração; e glorificarei o teu nome para sempre.
13 ౧౩ నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు. (Sheol h7585)
Pois grande é a tua misericórdia para comigo; e livraste minha alma das profundezas do Xeol. (Sheol h7585)
14 ౧౪ దేవా, గర్విష్ఠులు నా మీదికి ఎగబడ్డారు. దుర్మార్గులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నువ్వంటే వాళ్ళకు లెక్క లేదు.
Ó Deus, pessoas arrogantes têm se levantado contra mim; e muitos violentos procuram [matar] a minha alma, e te desprezam.
15 ౧౫ అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.
Porém tu, Senhor, és Deus misericordioso e piedoso; tardio para se irar, e abundante em bondade e verdade.
16 ౧౬ నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.
Volta-te para mim, e tem piedade de mim; dá tua força a teu servo, e salva o filho de tua serva.
17 ౧౭ యెహోవా, నీ ఆదరణ గుర్తు నాకు చూపించు. అప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు అది చూచి సిగ్గుపాలవుతారు. ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసి నన్ను ఆదరించావు.
Faze-me um sinal de bondade, para que os que me odeiam vejam, e se envergonhem; porque tu, SENHOR, tens me ajudado e consolado.

< కీర్తనల~ గ్రంథము 86 >