< కీర్తనల~ గ్రంథము 85 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. కోరహు వారసుల కీర్తన. యెహోవా, నువ్వు నీ దేశాన్ని దయ చూశావు, యాకోబు వంశస్తుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు.
A karmesternek. Kórach fiaitól. Zsoltár. Kedvelted, Örökkévaló, országodat, visszahoztad Jákób foglyait,
2 ౨ నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. (సెలా)
megbocsátottad néped bűnét, eltakartad minden vétküket. Széla.
3 ౩ నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు.
Visszavontad egész indulatodat, elfordítottad föllobbant haragodat.
4 ౪ మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు.
Térj vissza hozzánk, üdvünk Istene, és oszlasd el bosszúságodat ellenünk.
5 ౫ మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా?
Örökké haragszol-e reánk, elhúzod haragodat nemzedékig meg nemzedékig?
6 ౬ నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?
Nemde te újra fölélesztesz majd minket, hogy néped örüljön benned!
7 ౭ యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు.
Engedd látnunk, Örökkévaló, szeretetedet, és üdvödet add nekünk!
8 ౮ యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.
Hadd hallom, mit beszél az Isten, az Örökkévaló, midőn békét beszél népéhez és jámboraihoz, csak balgaságba ne essenek vissza.
9 ౯ ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది.
Bizony közel van tisztelőihez az ő üdve, hogy dicsőség lakozzék országunkban.
10 ౧౦ నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.
Szeretet és hűség találkoztak, igazság és béke csókolóztak;
11 ౧౧ భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది.
hűség a földből sarjad, igazság az égből tekint le.
12 ౧౨ యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది.
Az Örökkévaló is adja a jót és országunk megadja termését.
13 ౧౩ నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.
Igazság járjon előtte s útnak eressze lépteit.