< కీర్తనల~ గ్రంథము 84 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. కోరహు వారసుల కీర్తన. సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!
A karmesternek, a Gittitre. Kórach fiaitól. Zsoltár. Mi kedvesek a te lakaid, Örökkévaló, seregek ura!
2 యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.
Vágyódott és epedt is a lelkem az Örökkévaló udvarai után; szívem s húsom ujjonganak az élő Isten felé.
3 సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.
A madár is talált házat és a fecske fészket magának, a hová fiókáit tette, a te oltáraid mellett, oh Örökkévaló, seregek ura, én királyom és Istenem.
4 నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. (సెలా)
Boldogok, kik házadat lakják, egyre dicsérnek téged. Széla.
5 ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.
Boldog az ember, kinek benned van az ereje, kiknek útjaid vannak szívükben;
6 వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.
kik átvonulnak a sírás völgyén, forrássá teszik azt, áldásba is burkolja a tavaszi eső.
7 వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.
Haladnak erőről erőre, megjelennek Isten előtt Cziónban.
8 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. (సెలా)
Örökkévaló, Isten, seregek Ura, halljad imádságomat, figyelj, Jákób Istene! Széla.
9 దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.
Mi paizsunk, lásd, oh Isten és tekintsd fölkentednek arczát.
10 ౧౦ నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.
Mert jobb egy nap udvaraidban ezernél, inkább választom a küszöbön időzni Istenem házában semmint lakni gonoszságnak sátraiban.
11 ౧౧ యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.
Mert nap és paizs az Örökkévaló, az Isten; kegyet és dicsőséget ád az Örökkévaló – nem vonja meg a jót a gáncstalanul járóknak.
12 ౧౨ సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.
Örökkévaló, seregek Ura, boldog az ember, ki benned bízik!

< కీర్తనల~ గ్రంథము 84 >