< కీర్తనల~ గ్రంథము 82 >
1 ౧ ఆసాపు కీర్తన దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
परमेश्वर ईश्वरीय सभामा खडा हुनुहुन्छ । देवताहरूका माझमा उहाँले न्यायको फैसला गर्नुहुन्छ ।
2 ౨ ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? (సెలా)
कहिलेसम्म तिमीहरू अन्यायपुर्वक फैसला गर्छौ र दुष्टको पक्षलाई कृपा गर्छौ? सेला
3 ౩ పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
गरीब र अनाथहरूको बचाऊ गर । कष्टमा परेकाहरू र दरिद्रहरूको अधिकार कायम गर ।
4 ౪ పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.
गरीब र खाँचोमा परेकाहरूलाई बचाओ । तिनीहरूलाई दुष्टहरूका हातबाट छुट्टाओ ।
5 ౫ వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.
तिनीहरूले न जान्दछन् न बुझ्छन् । तिनीहरू अन्धकारमा भौंतारिन्छन् । पृथ्वीका सबै जगहरू टुक्रिन्छन् ।
6 ౬ మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.
मै भनें, “तिमीहरू देवताहरू हौ र तिमीहरू सबै जना सर्वोच्चका छोराहरू हौ ।
7 ౭ అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.
तापनि तिमीहरू मानिसहरूझैं मर्नेछौ र शासकमध्ये एक जनाझैं ढल्नेछौ ।”
8 ౮ దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.
हे परमेश्वर, पृथ्वीको न्याय गर्न उठ्नुहोस्, किनकि सबै जातिहरूमा तपाईंको उत्तराधिकार छ ।