< కీర్తనల~ గ్రంథము 81 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.
В конец, о точилех, псалом Асафу. Радуйтеся Богу помощнику нашему, воскликните Богу Иаковлю:
2 పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.
приимите псалом и дадите тимпан, псалтирь красен с гусльми:
3 అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
вострубите в новомесячии трубою, во благознаменитый день праздника вашего:
4 అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.
яко повеление Израилеви есть, и судба Богу Иаковлю.
5 ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను.
Свидение во Иосифе положи е, внегда изыти ему от земли Египетския: языка, егоже не ведяше, услыша.
6 వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి.
Отят от бремене хребет его: руце его в коши поработасте.
7 నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. (సెలా)
В скорби призвал Мя еси, и избавих тя: услышах тя в тайне бурне: искусих тя на воде Пререкания.
8 నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది!
Слышите, людие Мои, и засвидетелствую вам, Израилю, аще послушаеши Мене:
9 ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు.
не будет тебе бог нов, ниже поклонишися богу чуждему.
10 ౧౦ నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.
Аз бо есмь Господь Бог твой, изведый тя от земли Египетския: разшири уста твоя, и исполню я.
11 ౧౧ అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు.
И не послушаша людие Мои гласа Моего, и Израиль не внят Ми:
12 ౧౨ కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను.
и отпустих я по начинанием сердец их, пойдут в начинаниих своих.
13 ౧౩ అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది!
Аще быша людие Мои послушали Мене, Израиль аще бы в пути Моя ходил:
14 ౧౪ అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను.
ни о чесомже убо враги его смирил бых, и на оскорбляющыя их возложил бых руку Мою.
15 ౧౫ యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!
Врази Господни солгаша ему, и будет время их в век:
16 ౧౬ అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.
и напита их от тука пшенична, и от камене меда насыти их.

< కీర్తనల~ గ్రంథము 81 >