< కీర్తనల~ గ్రంథము 80 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, సోషన్నీము ఏదూత్ (ఒడంబడిక కలువలు) రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.
詠【求以色列復興】阿撒夫的詩歌,交與樂官。 以色列的牧養者,懇求您留心細聽,您率領若瑟的子孫有如率領羊群。坐於革魯賓之上者,求您大顯光榮。
2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు.
於厄弗辣因、本雅明和默納協之中;求您發顯您的威能,快來作我們的救星!
3 దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
天主,求您使我們能以復興,顯示您的慈顏,好拯救我們。
4 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు?
萬軍的天主,何時消除向您祈禱的百姓發怒?
5 కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
您給他們吃的是含淚的食物,您用汪汪淚水,作他們的飲料。
6 మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.
您使我們四鄰因我們而爭吵,您讓我們的仇人向我們嘲笑。
7 సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
萬軍的天主,求您復興我們,顯示您的慈顏,好拯救我們。
8 నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు.
您從埃及移來一棵葡萄樹,您把異民趕走,而種植這樹。
9 దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది.
給這樹準備了肥沃土質,這樹深深紮根,滿佈大地。
10 ౧౦ దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి,
他的蔭影遮蔽著群山峻嶺,它的枝幹與蒼天松柏相等;
11 ౧౧ దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి.
它的枝蔓伸展到海涯、它的根苗綿延到河壩。
12 ౧౨ దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు?
您為何折毀它的籬笆,任憑過路的人去砍伐,
13 ౧౩ అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి.
使森林的野豬去踐踏,使田間的野獸去吃它?
14 ౧౪ సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు.
萬軍的天主,求您領我們回去,求您從高天之上垂視而憐恤!
15 ౧౫ నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు.
求您常看顧這葡萄樹,和您右手種植的園圃,保護您所培養的小樹。
16 ౧౬ దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక.
願那放火焚燒它,砍伐它的人,因懍於您怒容的威嚇而沈淪。
17 ౧౭ నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు.
願您右手扶持您右邊的人。並扶助為您所堅固的子民!
18 ౧౮ అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం.
從此,我們再不願意離開您,賜我們生存,為能傳揚您名。
19 ౧౯ యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.
上主萬軍的天主,求您復興我們,顯示您的慈顏,好拯救我們!

< కీర్తనల~ గ్రంథము 80 >