< కీర్తనల~ గ్రంథము 8 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం. యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
Müzik şefi için - Gittit üzerine - Davut'un mezmuru Ey Egemenimiz RAB, Ne yüce adın var yeryüzünün tümünde! Gökyüzünü görkeminle kapladın.
2 ౨ శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.
Çocukların, hatta emziktekilerin sesiyle Set çektin hasımlarına, Düşmanı, öç alanı yok etmek için.
3 ౩ నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
Seyrederken ellerinin eseri olan gökleri, Oraya koyduğun ayı ve yıldızları,
4 ౪ నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
Soruyorum kendi kendime: “İnsan ne ki, onu anasın, Ya da insanoğlu ne ki, ona ilgi gösteresin?”
5 ౫ అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.
Nerdeyse bir tanrı yaptın onu, Başına yücelik ve onur tacını koydun.
6 ౬ నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.
Ellerinin yapıtları üzerine onu egemen kıldın, Her şeyi ayaklarının altına serdin;
7 ౭ గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,
Davarları, sığırları, Yabanıl hayvanları,
8 ౮ ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.
Gökteki kuşları, denizdeki balıkları, Denizde kıpırdaşan bütün canlıları.
9 ౯ యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
Ey Egemenimiz RAB, Ne yüce adın var yeryüzünün tümünde!