< కీర్తనల~ గ్రంథము 77 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, యెదూతూను అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన. నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు.
阿撒夫的詩歌,交與樂官耶杜通。 我呼號,我的呼聲上達天主前,我向天主高呼,求他俯聽矜憐。
2 ౨ నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.
我在患難之日,尋求上主,雖整夜伸手,亦不覺辛苦,我的心靈且不接受安撫。
3 ౩ నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. (సెలా)
我一懷念天主,即咨嗟哀歎,我一沉思考慮,即心灰意懶。
4 ౪ నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
您使我的眼睛徹夜不眠,我實煩燥難安,苦不堪言。
5 ౫ గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,
我回憶往昔的時日,我懷念過去的歲月。
6 ౬ ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
我的心靈夜間默默自問,我的神魂時時沉思質詢:
7 ౭ ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా?
難道天主永遠拒絕,難道不再回顧憐愛?
8 ౮ ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?
難道他的恩愛永遠停止,他的諾言也將永世廢棄?
9 ౯ దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? (సెలా)
難道天主忘記了慈悲﹖因憤怒而將慈愛關閉?
10 ౧౦ ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
因此我說:這是我的苦難:至高者的右手已經改變。
11 ౧౧ అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.
我現今追念上主的作為,回想您往昔所行的奇蹟;
12 ౧౨ నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.
沉思您的一切所作所為,更要默想您的一切異事。
13 ౧౩ దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు?
天主,您的行徑完全在於聖化,何神像我們的天主如此偉大?
14 ౧౪ నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
只有您是施行奇蹟的天主!在萬民中彰顯了您的威武。
15 ౧౫ నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. (సెలా)
您以臂力拯救了您的人民,就是雅各伯和若瑟的子孫。
16 ౧౬ దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి.
大水一旦看見您,天主,大水一見您就都恐怖,連深淵汪洋也都顫抖。
17 ౧౭ మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి.
雲天大雨傾降,烏雲發出巨響,火箭滿天飛翔。
18 ౧౮ నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది.
您的雷霆在旋風中發響,閃電也將整個世界照亮,大地驚慌失措而又搖盪。
19 ౧౯ సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.
您的道路雖然經過海底,您的途徑雖然穿越大水,卻沒有顯露出您的足跡。
20 ౨౦ మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.
您曾藉著梅瑟和亞郎的手掌,領導您的子民有如領導群羊。