< కీర్తనల~ గ్రంథము 76 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యాలతో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.
Til sangmesteren på strengelek; en salme av Asaf; en sang. Gud er kjent i Juda, hans navn er stort i Israel.
2 ౨ షాలేంలో ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.
Og han reiste sin hytte i Salem og sin bolig på Sion.
3 ౩ అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. (సెలా)
Der sønderbrøt han buens lyn, skjold og sverd og krig. (Sela)
4 ౪ నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.
Strålende er du, herlig fremfor røverfjellene.
5 ౫ గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.
Mennene med det sterke hjerte er blitt et rov; de sover sin søvn, og ingen av de veldige menn fant sine hender.
6 ౬ యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.
Ved din trusel, Jakobs Gud, falt både vogn og hest i dyp søvn.
7 ౭ నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?
Du - forferdelig er du, og hvem kan bli stående for ditt åsyn når du blir vred?
8 ౮ నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.
Fra himmelen lot du høre dom; jorden fryktet og blev stille,
9 ౯ దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. (సెలా)
da Gud reiste sig til dom for å frelse alle saktmodige på jorden. (Sela)
10 ౧౦ కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.
For menneskets vrede blir dig til pris; med enda større vrede omgjorder du dig.
11 ౧౧ మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
Gjør løfter og gi Herren eders Gud det I har lovt! Alle de som er omkring ham, skal komme med gaver til den Forferdelige.
12 ౧౨ అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.
Han kuer fyrstenes stolte ånd, forferdelig for kongene på jorden.