< కీర్తనల~ గ్రంథము 75 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు.
Veisuunjohtajalle; veisataan kuin: "Älä turmele"; virsi; Aasafin laulu. Me kiitämme sinua, Jumala, me kiitämme sinua; lähellä on sinun nimesi, sinun ihmeitäsi kerrotaan.
2 ౨ నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను.
"Vaikka minä valitsenkin ajan, minä tuomitsen oikein.
3 ౩ భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. (సెలా)
Vaikka maa kaikkine asukkaineen menehtyy pelkoon, pidän minä pystyssä sen patsaat." (Sela)
4 ౪ అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.
"Ylvästelijöille minä sanon: älkää ylvästelkö, ja jumalattomille: älkää sarvea nostako.
5 ౫ విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను.
Älkää nostako sarveanne korkealle, älkää puhuko niskoitellen, julkeasti."
6 ౬ తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.
Ei tule apua idästä, ei lännestä, ei vuorisesta erämaasta,
7 ౭ దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు.
vaan Jumala on se, joka tuomitsee: yhden hän alentaa, toisen ylentää.
8 ౮ యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు. భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి.
Sillä Herran kädessä on malja, joka vaahtoaa täynnänsä höystettyä viiniä, ja siitä hän kaataa; kaikkien maan jumalattomien täytyy se juoda, särpiä pohjasakkaa myöten.
9 ౯ నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను.
Mutta minä julistan iäti, veisaan kiitosta Jaakobin Jumalalle.
10 ౧౦ నేను భక్తిహీనుల కొమ్ములను విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు.
Ja kaikki jumalattomien sarvet minä katkaisen; korkealle kohoavat vanhurskaan sarvet.