< కీర్తనల~ గ్రంథము 74 >

1 ఆసాపు కీర్తన దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?
Asaf dwom. Ao Onyankopɔn, adɛn enti na woapo yɛn koraa yi? Adɛn enti na wʼabofuo hye wʼadidibea nnwan?
2 నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో.
Kae nkurɔfoɔ a wotɔɔ wɔn teteete no, abusua a ɛyɛ wʼagyapadeɛ a wogyee wɔn no, Bepɔ Sion, baabi a woteɛ hɔ.
3 నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
Dane wo ho kyerɛ mmubuiɛ a ɛda so wɔ hɔ yi so, saa ɔsɛeɛ a ɔtamfoɔ no de abrɛ wo kronkronbea no.
4 నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు.
Wʼatamfoɔ bobɔɔ mu wɔ baabi a wohyiaa yɛn no; wɔasisi wɔn mfrankaa sɛ agyiraeɛhyɛdeɛ wɔ hɔ.
5 దట్టమైన గుబురు చెట్ల మీద గొడ్డళ్ళు ఎత్తినట్టు అది కనిపిస్తున్నది.
Wɔyɛɛ wɔn sɛ nnipa a wɔrehwim mmonnua de abubu nnua a ayɛ nkyɛkyerɛ.
6 వారు గొడ్డళ్ళు, సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు.
Wɔde wɔn mmonnua ne nname bubuu nnua a wɔasene adi ho adwinneɛ no.
7 నీ పరిశుద్ధ స్థలానికి మంట పెట్టారు. నీ నివాసమైన మందిరాన్ని నేలమట్టం చేసి అపవిత్రపరిచారు.
Wɔhyee wo kronkronbea no dwerɛbee; wɔguu baabi a wo Din teɛ no ho fi.
8 వాటినన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేద్దాం అనుకుంటూ వారు దేశంలోని నీ సమావేశ మందిరాలన్నిటినీ కాల్చివేశారు.
Wɔkaa wɔ wɔn akoma mu sɛ, “Yɛbɛtiatia wɔn so ayɛ wɔn pasaa!” Wɔhyee baabiara a wɔsom Onyankopɔn wɔ asase no so.
9 దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
Yɛnhunu wo nsɛnkyerɛnneɛ a ɛyɛ nwanwa biara bio; adiyifoɔ no nyinaa asa, na yɛn mu biara nnim nna dodoɔ a ɛbɛdie.
10 ౧౦ దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?
Ao Onyankopɔn, wʼatamfoɔ bɛsere wo akɔsi da bɛn? Wɔn a wɔkyiri woɔ no bɛgu wo din ho fi daa anaa?
11 ౧౧ నీ హస్తాన్ని, నీ కుడి చేతిని ఎందుకు ముడుచుకుని ఉన్నావు? నీ వస్త్రంలో నుండి దాన్ని తీసి వారిని నాశనం చెయ్యి.
Adɛn enti na woatwe wo nsa, wo nsa nifa no? Yi firi wʼatadeɛ mmobɔeɛ no mu na sɛe wɔn.
12 ౧౨ పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా ఈ భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.
Nanso, Ao Onyankopɔn, woyɛ me ɔhene firi tete; wode nkwagyeɛ ba asase so.
13 ౧౩ నీ బలంతో సముద్రాన్ని పాయలుగా చేశావు. నీటిలోని బ్రహ్మాండమైన సముద్ర వికృత జీవుల తలలు చితకగొట్టావు.
Ɛyɛ wo na wode wo tumi paee ɛpo mu no; wopɛkyɛɛ nsuo mu ɔtweaseɛ no ti.
14 ౧౪ సముద్ర రాక్షసి తలలను నువ్వు ముక్కలు చేశావు. అరణ్యాల్లో నివసించే వారికి దాన్ని ఆహారంగా ఇచ్చావు.
Wopɛkyɛɛ Lewiatan no ti na wode no maa ɛserɛ so abɔdeɛ sɛ wɔn aduane.
15 ౧౫ నీటి ఊటలను, ప్రవాహాలను పుట్టించావు. నిత్యం పారే నదులను ఎండిపోజేశావు.
Wo na womaa nsuwa ne nsutire tueeɛ; na womaa nsubɔntene a ɛtene weweeɛ.
16 ౧౬ పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నువ్వే వాటి స్థానాల్లో ఉంచావు.
Adekyeeɛ wɔ wo na adesaeɛ nso yɛ wo dea; wode owia ne ɔsrane sisii hɔ.
17 ౧౭ భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.
Ɛyɛ wo na wototoo asase so ahyeɛ nyinaa; wobɔɔ ahuhuro ne awɔ mmerɛ.
18 ౧౮ యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.
Ao Awurade, kae sɛdeɛ ɔtamfoɔ no sere woɔ, sɛdeɛ nkwaseafoɔ agu wo din ho fi.
19 ౧౯ నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.
Mfa wʼaborɔnoma nkwa mma nkekaboa; mma wo werɛ mfiri wo nkurɔfoɔ a wɔrehunu amane no nkwa afebɔɔ.
20 ౨౦ నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.
Ma wʼapam no ho nhia wo, ɛfiri sɛ akakabensɛm ahyɛ asase no so sum ma.
21 ౨౧ పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.
Mma wɔn a wɔahyɛ wɔn soɔ no anim nngu ase; ma ahiafoɔ ne mmɔborɔfoɔ nkamfo wo din.
22 ౨౨ దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
Ao Onyankopɔn, ma wo ho so na ka wo ara wʼasɛm; kae sɛdeɛ nkwaseafoɔ sere wo da mu nyinaa.
23 ౨౩ నీ శత్రువుల స్వరాన్ని, నిన్ను ఎడతెగక ఎదిరించేవారి గర్జింపులను మరచిపోవద్దు.
Mmu wʼani ngu wɔn a wɔsɔre tia wo no nteateam so, wʼatamfoɔ gyegyeegye a ɛkɔ soro daa no.

< కీర్తనల~ గ్రంథము 74 >