< కీర్తనల~ గ్రంథము 74 >
1 ౧ ఆసాపు కీర్తన దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?
Зашто се, Боже, срдиш на нас дуго; дими се гнев Твој на овце паше Твоје?
2 ౨ నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో.
Опомени се сабора свог, који си стекао од старине, искупио себи у наследну државу, горе Сиона, на којој си се населио.
3 ౩ నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
Подигни стопе своје на старе развалине: све је разрушио непријатељ у светињи.
4 ౪ నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు.
Ричу непријатељи Твоји на месту сабора Твојих, своје обичаје постављају место наших обичаја.
5 ౫ దట్టమైన గుబురు చెట్ల మీద గొడ్డళ్ళు ఎత్తినట్టు అది కనిపిస్తున్నది.
Видиш, они су као онај који подиже секиру на сплетене гране у дрвета.
6 ౬ వారు గొడ్డళ్ళు, సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు.
Све у њему што је резано разбише секирама и брадвама.
7 ౭ నీ పరిశుద్ధ స్థలానికి మంట పెట్టారు. నీ నివాసమైన మందిరాన్ని నేలమట్టం చేసి అపవిత్రపరిచారు.
Огњем сажегоше светињу Твоју; на земљу обаливши оскврнише стан имена Твог.
8 ౮ వాటినన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేద్దాం అనుకుంటూ వారు దేశంలోని నీ సమావేశ మందిరాలన్నిటినీ కాల్చివేశారు.
Рекоше у срцу свом: Потримо их сасвим. Попалише сва места сабора Божијих на земљи.
9 ౯ దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
Обичаја својих не видимо, нема више пророка, и нема у нас ко би знао докле ће то трајати.
10 ౧౦ దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?
Докле ће се, Боже, ругати насилник? Хоће ли довека противник пркосити имену Твом?
11 ౧౧ నీ హస్తాన్ని, నీ కుడి చేతిని ఎందుకు ముడుచుకుని ఉన్నావు? నీ వస్త్రంలో నుండి దాన్ని తీసి వారిని నాశనం చెయ్యి.
Зашто устављаш руку своју и десницу своју? Пружи из недара својих, и истреби их.
12 ౧౨ పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా ఈ భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.
Боже, царе мој, који од старине твориш спасење посред земље!
13 ౧౩ నీ బలంతో సముద్రాన్ని పాయలుగా చేశావు. నీటిలోని బ్రహ్మాండమైన సముద్ర వికృత జీవుల తలలు చితకగొట్టావు.
Ти си силом својом раскинуо море, и сатро главе воденим наказама.
14 ౧౪ సముద్ర రాక్షసి తలలను నువ్వు ముక్కలు చేశావు. అరణ్యాల్లో నివసించే వారికి దాన్ని ఆహారంగా ఇచ్చావు.
Ти си размрскао главу крокодилу, дао га онима који живе у пустињи да га једу.
15 ౧౫ నీటి ఊటలను, ప్రవాహాలను పుట్టించావు. నిత్యం పారే నదులను ఎండిపోజేశావు.
Ти си отворио изворе и потоке, Ти си исушио реке које не пресишу.
16 ౧౬ పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నువ్వే వాటి స్థానాల్లో ఉంచావు.
Твој је дан и Твоја је ноћ, Ти си поставио звезде и сунце.
17 ౧౭ భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.
Ти си утврдио све крајеве земаљске, лето и зиму Ти си уредио.
18 ౧౮ యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.
Опомени се тога, непријатељ се руга Господу, и народ безумни не мари за име Твоје.
19 ౧౯ నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.
Не дај зверима душу грлице своје, немој заборавити стадо страдалаца својих засвагда.
20 ౨౦ నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.
Погледај на завет; јер су све пећине земаљске пуне станова безакоња.
21 ౨౧ పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.
Невољник нек се не врати срамотан, ништи и убоги нека хвале име Твоје.
22 ౨౨ దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
Устани, Боже, брани ствар своју, опомени се како Ти се безумник руга сваки дан!
23 ౨౩ నీ శత్రువుల స్వరాన్ని, నిన్ను ఎడతెగక ఎదిరించేవారి గర్జింపులను మరచిపోవద్దు.
Не заборави обести непријатеља својих, вике, коју једнако дижу противници Твоји!