< కీర్తనల~ గ్రంథము 72 >
1 ౧ సొలొమోను కీర్తన దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.
所羅門的詩。 上帝啊,求你將判斷的權柄賜給王, 將公義賜給王的兒子。
2 ౨ అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.
他要按公義審判你的民, 按公平審判你的困苦人。
3 ౩ నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.
大山小山都要因公義使民得享平安。
4 ౪ ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.
他必為民中的困苦人伸冤, 拯救窮乏之輩, 壓碎那欺壓人的。
5 ౫ సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక.
太陽還存,月亮還在, 人要敬畏你,直到萬代!
6 ౬ కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.
他必降臨,像雨降在已割的草地上, 如甘霖滋潤田地。
7 ౭ అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక.
在他的日子,義人要發旺, 大有平安,好像月亮長存。
8 ౮ సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక.
他要執掌權柄,從這海直到那海, 從大河直到地極。
9 ౯ ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.
住在曠野的,必在他面前下拜; 他的仇敵必要舔土。
10 ౧౦ తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.
他施和海島的王要進貢; 示巴和西巴的王要獻禮物。
11 ౧౧ రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక.
諸王都要叩拜他; 萬國都要事奉他。
12 ౧౨ ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.
因為,窮乏人呼求的時候,他要搭救; 沒有人幫助的困苦人,他也要搭救。
13 ౧౩ నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.
他要憐恤貧寒和窮乏的人, 拯救窮苦人的性命。
14 ౧౪ బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.
他要救贖他們脫離欺壓和強暴; 他們的血在他眼中看為寶貴。
15 ౧౫ రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.
他們要存活。 示巴的金子要奉給他; 人要常常為他禱告,終日稱頌他。
16 ౧౬ దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.
在地的山頂上,五穀必然茂盛; 所結的穀實要響動,如黎巴嫩的樹林; 城裏的人要發旺,如地上的草。
17 ౧౭ రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.
他的名要存到永遠, 要留傳如日之久。 人要因他蒙福; 萬國要稱他有福。
18 ౧౮ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతులు పొందుతాడు గాక. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.
獨行奇事的耶和華-以色列的上帝 是應當稱頌的!
19 ౧౯ ఆయన మహిమగల నామం నిరంతరం స్తుతులు పొందుతుంది గాక. ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్.
他榮耀的名也當稱頌,直到永遠。 願他的榮耀充滿全地! 阿們!阿們!
20 ౨౦ యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.
耶西的兒子-大衛的祈禱完畢。