< కీర్తనల~ గ్రంథము 70 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు రాసిన జ్ఞాపకార్థ కీర్తన. దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.
Til songmeisteren; av David; til minnesofferet. Gud, ver meg til berging! Herre, kom meg snart til hjelp!
2 ౨ నన్ను చంపాలని, బాధించాలని చూసేవారు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక.
Lat deim verta til skam og spott, dei som stend etter mitt liv! Lat deim vika attende og skjemmast, som hev hugnad i mi ulukka!
3 ౩ ఆహా ఆహా అని పలికేవారు సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్తారు గాక.
Lat deim snu for si skjemd dei som segjer: «Ha, ha!»
4 ౪ నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక.
Lat deim fegnast og gleda seg i deg, alle dei som søkjer deg! Lat deim som elskar di frelsa, alltid segja: «Høglova vere Gud!»
5 ౫ నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు.
For eg er arm og fatig; Gud, kom snart til meg! Du er mi hjelp og min frelsar; Herre, dryg ikkje!