< కీర్తనల~ గ్రంథము 70 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు రాసిన జ్ఞాపకార్థ కీర్తన. దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.
למנצח לדוד להזכיר אלהים להצילני יהוה לעזרתי חושה
2 నన్ను చంపాలని, బాధించాలని చూసేవారు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక.
יבשו ויחפרו מבקשי נפשי יסגו אחור ויכלמו חפצי רעתי
3 ఆహా ఆహా అని పలికేవారు సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్తారు గాక.
ישובו על-עקב בשתם-- האמרים האח האח
4 నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక.
ישישו וישמחו בך-- כל-מבקשיך ויאמרו תמיד יגדל אלהים-- אהבי ישועתך
5 నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు.
ואני עני ואביון-- אלהים חושה-לי עזרי ומפלטי אתה יהוה אל-תאחר

< కీర్తనల~ గ్రంథము 70 >