< కీర్తనల~ గ్రంథము 7 >

1 బెన్యామీనీయుడైన కూషు గురించి యెహోవాకు దావీదు కూర్చిన సంగీతం. యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు.
مزمور داوود، که به سبب سخنان کوش بنیامینی برای خداوند سرایید. ای خداوند، خدای من، به تو پناه می‌آورم؛ مرا از دست تعقیب‌کنندگانم نجات ده،
2 లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు.
و گرنه آنها همچون شیر مرا می‌درند و تکه‌تکه می‌کنند بدون آنکه کسی بتواند به نجاتم بشتابد.
3 యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు.
ای خداوند، خدای من، اگر به کسی ظلم کرده‌ام،
4 నాతో శాంతిసమాధానాలతో ఉన్నవాళ్ళ పట్ల నేను ఏ తప్పూ చెయ్యలేదు. విచక్షణ లేకుండా నా విరోధులకు నేను ఏ హానీ చెయ్యలేదు.
اگر خوبی را با بدی تلافی نموده‌ام و یا به ناحق دشمن خود را غارت کرده‌ام،
5 నేను చెప్పేది సత్యం కాకపోతే నా శత్రువు నన్ను తరిమి పట్టుకుంటాడు గాక. బ్రతికి ఉన్న నా శరీరాన్ని తొక్కి, నేలరాసి దుమ్ములో అవమానకరమైన స్థితిలో నన్ను పడవేస్తాడు గాక. (సెలా)
آنگاه بگذار دشمن مرا تعقیب نموده، به دام اندازد و زندگی‌ام را تباه سازد.
6 యెహోవా, కోపంతో లేచి రా, నా శత్రువుల ఆగ్రహానికి విరోధంగా నిలబడు. నా నిమిత్తం లేచి వచ్చి వాళ్ళ కోసం నువ్వు ఆజ్ఞాపించిన న్యాయ విధులను జరిగించు.
ای خداوند، برخیز و با غضبت در مقابل خشم دشمنانم بایست! ای خدای من، برخیز و عدالت را برقرار نما.
7 నీ చుట్టూ జాతులు సమాజంగా కూడి ఉన్నాయి. మరొకసారి నువ్వు వాళ్ళ మీద నీ న్యాయమైన స్థానాన్ని చేపట్టు.
همهٔ قومها را نزد خود جمع کن و از بالا بر ایشان داوری فرما.
8 యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.
ای خداوند که داور همهٔ مردم هستی، پاکی و بی‌گناهی مرا ببین و حکم بده.
9 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.
ای خدای عادل که از افکار و دلهای ما باخبری، بدیها را از بین ببر و نیکان را استوار ساز.
10 ౧౦ హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది.
خدا سپر من است و از من محافظت می‌کند. او کسانی را که دلشان پاک و راست است، نجات می‌بخشد.
11 ౧౧ దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు.
خدا داور عادل است. او هر روز بر بدکاران خشمگین می‌شود.
12 ౧౨ ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
اگر آنها به سوی خدا بازگشت نکنند، او شمشیرش را تیز خواهد کرد. خدا کمان خود را کشیده و آماده کرده است.
13 ౧౩ అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు.
او سلاحهای مرگبار و تیرهای آتشین خود را به دست گرفته است.
14 ౧౪ దుష్టత్వాన్ని గర్భం ధరించినవాడి సంగతి ఆలోచించండి. అతడు నాశనకరమైన ప్రణాళికలు రచిస్తూ, హానికరమైన అబద్ధాలకు జన్మనిస్తాడు.
وجود اشخاص گناهکار پر از شرارت و ظلم است و اعمالشان نادرست.
15 ౧౫ వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు.
آنها برای دیگران چاه می‌کنند، اما خود در آن می‌افتند
16 ౧౬ అతడు రచించిన నాశనకరమైన ప్రణాళికలు అతని తల మీదకే వస్తాయి. అతడు ఆలోచించిన హింస అతని తల మీదకే వచ్చిపడుతుంది.
و در دام بداندیشی و ظلم خود گرفتار می‌شوند.
17 ౧౭ యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.
خداوند را به خاطر عدالتش می‌ستایم و در وصف او که متعال است می‌سرایم.

< కీర్తనల~ గ్రంథము 7 >