< కీర్తనల~ గ్రంథము 7 >
1 ౧ బెన్యామీనీయుడైన కూషు గురించి యెహోవాకు దావీదు కూర్చిన సంగీతం. యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు.
A musical composition of David, which he sang to Yahweh concerning the words of Cush the Benjamite. Yahweh my God, I take refuge in you! Save me from all who chase me, and rescue me.
2 ౨ లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు.
Otherwise, they will rip me apart like a lion, tearing me in pieces with no one else able to bring me to safety.
3 ౩ యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు.
Yahweh my God, if I have done this, and there is guilt on my hands—
4 ౪ నాతో శాంతిసమాధానాలతో ఉన్నవాళ్ళ పట్ల నేను ఏ తప్పూ చెయ్యలేదు. విచక్షణ లేకుండా నా విరోధులకు నేను ఏ హానీ చెయ్యలేదు.
if I have done evil to him who was at peace with me, or senselessly harmed my enemy without cause, then hear my words.
5 ౫ నేను చెప్పేది సత్యం కాకపోతే నా శత్రువు నన్ను తరిమి పట్టుకుంటాడు గాక. బ్రతికి ఉన్న నా శరీరాన్ని తొక్కి, నేలరాసి దుమ్ములో అవమానకరమైన స్థితిలో నన్ను పడవేస్తాడు గాక. (సెలా)
Then let my enemy pursue my life and overtake me; let him trample my life to the ground and lay my honor in the dust. (Selah)
6 ౬ యెహోవా, కోపంతో లేచి రా, నా శత్రువుల ఆగ్రహానికి విరోధంగా నిలబడు. నా నిమిత్తం లేచి వచ్చి వాళ్ళ కోసం నువ్వు ఆజ్ఞాపించిన న్యాయ విధులను జరిగించు.
Arise, Yahweh, in your anger; stand up against the rage of my enemies; wake up for my sake and carry out the righteous decrees that you have commanded for them.
7 ౭ నీ చుట్టూ జాతులు సమాజంగా కూడి ఉన్నాయి. మరొకసారి నువ్వు వాళ్ళ మీద నీ న్యాయమైన స్థానాన్ని చేపట్టు.
The countries are assembled all around you; take once more your rightful place over them.
8 ౮ యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.
Yahweh, judge the nations; vindicate me, Yahweh, because I am righteous and innocent, Most High.
9 ౯ దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.
May the evil deeds of the wicked come to an end, but establish the righteous people, righteous God, you who examine hearts and minds.
10 ౧౦ హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది.
My shield comes from God, the one who saves the upright in heart.
11 ౧౧ దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు.
God is a righteous judge, a God who is indignant each day.
12 ౧౨ ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
If a person does not repent, God will sharpen his sword and will prepare his bow for battle.
13 ౧౩ అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు.
He prepares to use weapons against him; he makes his arrows flaming shafts.
14 ౧౪ దుష్టత్వాన్ని గర్భం ధరించినవాడి సంగతి ఆలోచించండి. అతడు నాశనకరమైన ప్రణాళికలు రచిస్తూ, హానికరమైన అబద్ధాలకు జన్మనిస్తాడు.
Think about the one who is pregnant with wickedness, who conceives destructive plans, who gives birth to harmful lies.
15 ౧౫ వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు.
He digs a pit and hollows it out and then falls into the hole he has made.
16 ౧౬ అతడు రచించిన నాశనకరమైన ప్రణాళికలు అతని తల మీదకే వస్తాయి. అతడు ఆలోచించిన హింస అతని తల మీదకే వచ్చిపడుతుంది.
His own destructive plans return to his own head, for his violence comes down on his own head.
17 ౧౭ యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.
I will give thanks to Yahweh for his justice; I will sing praise to Yahweh Most High.